ఆయిల్ ఫామ్ సాగుపై ప్రత్యేక దృష్టి, కేతే పల్లి మండలం ఇనుపాములలో ఆయిల్ పామ్ నర్సరీ సందర్శన : రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ ఎల్.వెంకట్రామి రెడ్డి

పత్రికా ప్రకటన
ఆయిల్ ఫామ్ సాగు పై ప్రత్యేక దృష్టి:రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ ఎల్.వెంకట్రామి రెడ్డి
# కేతే పల్లి మండలం ఇను పాముల లో ఆయిల్ పామ్ నర్సరీ సందర్శన

కేతే పల్లి,అక్టోబర్ 2.జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు వైపు రైతులను ప్రోత్సహించి విస్తీర్ణం పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించి నట్లు రాష్ట్ర ఉద్యాన,పట్టు పరిశ్రమ శాఖ సంచాలకులు ఎల్.వెంకట్రామి రెడ్డి అన్నారు. శనివారం జిల్లా ఉద్యాన శాఖ అధికారిణి సంగీత లక్ష్మీ తో కలిసి ఆయన కేతేపల్లి మండలం ఇనుపాముల లోని నర్సరీ శనివారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలు ఆయిల్ ఫామ్(పామాయిల్) పంటపై ఉద్యాన శాఖ ప్రత్యేక దృష్టి సారించి నట్లు తెలిపారు. రాబోయే సంవత్సర కాలం లో ఆయిల్ ఫామ్ నల్గొండ జిల్లాలో 30 వేల ఎకరాలకు విస్తీర్ణం పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు,అందులో భాగంగా ఆయిల్ ఫామ్ నర్సరీ ని క్షేత్ర సందర్శన చేసినట్లు ఆయన తెలిపారు. నర్సరీ నిర్వహణ,మొక్కల పెంపకం లో తీసుకోవలసిన జాగ్రత్తలు,సూచనల తో పాటు నాణ్యమైన మొక్కలను రైతులకు అందుబాటులో ఉంచాలని నల్గొండ జిల్లా కేటాయించబడిన (రుచి-పతంజలి) కంపెనీ ప్రతి నిధులకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ కార్యాలయంలోని సహాయ సంచాలకులు యాదగిరి, విజయ ప్రసాద్, సూర్యాపేట జిల్లా ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు శ్రీధర్, నకిరేకల్ నియోజకవర్గ ఉద్యాన అధికారి ఆర్. విద్యాసాగర్, సూర్యాపేట ఉద్యాన అధికారి జగన్, రుచి పతాంజలి కంపెనీ నల్గొండ జిల్లా మేనేజర్ రవీందర్ రెడ్డి, ప్రతినిధులు,రైతులు పాల్గొన్నారు.

 

Share This Post