జిల్లా రైతులు ఆయిల్ ఫామ్ సాగు పై అవగాహన కు కృష్షా జిల్లా అంపా పురం కు విజ్ఞాన యాత్రకు శుక్రవారం బయలు దేరి వెళ్లారు. జిల్లాలో అయిల్ ఫామ్ సాగు ప్రోత్సహించేందుకు ఆసక్తి ఉన్న రైతులను 90 మంది రెండు బస్సులలో మిర్యాలగూడ, అనుముల నుండి ఉద్యాన,పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఉద్యాన శాఖ అధికారులతో కలిసి శుక్రవారం బయలు దేరి వెళ్లారు. కృష్ణా జిల్లా అంపా పురం లో,రుచి సోయా ఫ్యాక్టరీ,తోటలను వారు సందర్శించారు.ఇంకా మిగిలిన మిగతా రైతులను కూడా అక్టోబర్ 5 న అశ్వారావుపేట, కొత్తగూడెం లో ఆయిల్ ఫామ్ క్షేత్రం,ఆయిల్ ఫామ్ మిల్లు కు,పెదవేగి, ఏలూరు,పశ్చిమ గోదావరి జిల్లాకు తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఉద్యాన,పట్టు పరిశ్రమ శాఖ అధికారిణి సంగీత లక్ష్మీ తెలిపారు.