ఆయుష్ ఆరోగ్య కరదీపికను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ మోతిలాల్
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆయుష్ విభాగం ఆధ్వర్యాన వైద్యవిధానాలు, ఆరోగ్య పరిరక్షణ అంశాలతో రూపొందించిన కరదీపికను గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ ఎస్. మోతిలాల్ తన చాంబర్ లో ఆవిష్కరించారు. ఆయుష్ వైద్య విధానాలు, ఆరోగ్య పరిరక్షణ గురించి ఈ కరదీపికలో చక్కగా వివరించినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.
సామాన్య ప్రజానీకానికి ఆయుష్ విభాగం గురించి పూర్తి అవగాహన కలుగుతుందన్నారు. ఆయుష్ వైద్యులు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ వైద్యాధికారులు డాక్టర్ సూర్య నాయక్, డాక్టర్ ఇస్మాయిల్, డాక్టర్ జహీరుద్దీన్, డాక్టర్ హరి నాయక్, డాక్టర్ రాధిక, ఫార్మసిస్ట్ దశరథం, మురళీకృష్ణ పాల్గొన్నారు.