ఆయుష్ మెడికల్ ఆఫీసర్ల నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం…… జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

ఆయుష్ మెడికల్ ఆఫీసర్ల నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం…… జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి జిల్లాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఆయుష్ మెడికల్ ఆఫీసర్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో 9 ఆయుష్ మెడికల్ ఆఫీసర్ల పోస్టులను సంవత్సర కాలానికి కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

ఆయుర్వేదిక్ 5 పోస్టులు, హోమియోపతి నాలుగు పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

ఇట్టి పోస్టులకు బిఎఎంఎస్/
బిహెచ్ఎంఎస్ అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఇండియన్ మెడిసిన్ బోర్డ్ లో నమోదై ఉండాలని స్పష్టం చేశారు.

అభ్యర్థులు ఈనెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 22 నుండి 27 వరకు దరఖాస్తుల స్కూటీని జరుగుతుందని, 28న ప్రొవిజినల్ మెరిట్ లిస్టు నోటీసు బోర్డులో ప్రదర్శిస్తారని, అభ్యంతరాలను స్వీకరిస్తారని,
మార్చి,6న ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు మార్చి 8న కౌన్సిలింగ్ నిర్వహించి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 20 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులకు, గైడ్లైన్స్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వెబ్సైట్ నుండి పొందవచ్చని సూచించారు.

Share This Post