ఆయుష్ వైద్యశాల ఏర్పాటు కోసం స్వాతంత్ర సమరయోధుల భవనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

కామారెడ్డి, మార్చి 11 2022 —————— కామారెడ్డి పట్టణంలోని ఎన్ జి ఓ ఎస్ కాలనీలో ఉన్న స్వాతంత్ర సమరయోధుల భవనంలో ఆయుష్ వైద్యశాల ఏర్పాటు కోసం భవనాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. భవనం ఆయుష్ వైద్యశాల ఏర్పాటుకు అనుకూలంగా ఉందని చెప్పారు. భవనంలో అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. యోగా కోసం షెడ్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య, వైద్యాధికారి చంద్రశేఖర్, వైద్యుడు వెంకటేశ్వర్లు, తహసిల్దార్ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. —————— జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయనైనది.

Share This Post