ఆరుగాలం కష్టించే రైతు ఇబ్బంది పడకూడదు…

ప్రచురణార్థం

ఆరుగాలం కష్టించే రైతు ఇబ్బంది పడకూడదు…

దంతాలపల్లి,
మహబూబాబాద్ డిసెంబర్ 8.

భారత ఆహార సంస్థ యాసంగి ధాన్యాన్ని కొనలేమని స్పష్టం చేసినందున రైతులు వరి పంట వేసి ఇబ్బందులు పడకూడదని ఆరుగాలం కష్టించే రైతుకు వెన్నంటి ఉండాలని ఆరుతడి పంటలనే చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ శశాంక కోరారు.

బుధవారం కలెక్టర్ దంతాలపల్లి మండలం గున్నేపల్లి లో సర్పంచ్ గండి వెంకట నారాయణ అధ్యక్షతన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన రైతు అవగాహన సదస్సు లో పాల్గొని మాట్లాడారు.

నీళ్లు సమృద్ధిగా ఉండటంతో రైతులు నాలుగు సంవత్సరాలుగా ఓకే పంటను చేపడుతూ భూసారాన్ని కూడా లెక్కచేయకుండా వరి పంట వేయడంతో దిగుబడి తోపాటు విస్తీర్ణం కూడా పెరిగిపోయి గత వాన కాలంలో ఒక లక్ష ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ప్రస్తుత కాలంలో రెండింతలు పెరిగి రెండు లక్షల పైచిలుకు ధాన్యం వచ్చిందని అన్నారు.

గతంలో కొనుగోలు చేసిన ధాన్యమే మిల్లుల లోనూ గోదాముల లోనూ నిల్వలు పేరుకుపోయాయి అని ధాన్యం నిల్వ కు స్థలం కూడా లేదన్నారు.

గతంలో రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే చేపట్టే వారని ప్రస్తుత తరుణంలో కోతుల బెడద నీరు సమృద్ధిగా లభించడం వంటి కారణాలతో వరి పంట వైపే మొగ్గు చూపుతున్నారని లాభాలు రాకపోయినా వరి పంటను ఏ చేపట్టడం శ్రేయస్కరం కాదని రైతులు ఒకసారి పునరాలోచన చేయాలన్నారు .

దంతాలపల్లి మండలం లో 14 వేల ఎకరాలలో వరి సాగు జరుగుతున్నదని ఆరు వందల ఎకరాలు చెరువుల క్రింద అయితే 13 వేల ఎకరాలు బావులు బోర్ల కింద సాగు చేస్తున్నట్టు తన దృష్టిలో ఉందన్నారు.

మరోవైపు గా చూస్తే మూడున్నర లక్షల ఎకరాలు అటవీ భూమి లో 92 వేల ఎకరాలు అంటే మూడవ వంతు ఆక్రమణకు గురైందని గుట్టలను సైతం తొలుస్తూ పనులు చేస్తూ అటవీ విస్తీర్ణం తగ్గించడంతో జంతువులు గ్రామాలపై పడుతున్నాయన్నారు ఇప్పటికే కుక్కలకు ఏబిసి యాంటీ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి కుటుంబ నియంత్రణ లో చేపట్టామని కోతులకు కూడా కుటుంబనియంత్రణ కార్యక్రమానికి చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి పిలుపు మేరకు హరితహారం కార్యక్రమం చేపట్టి జంతువులను తిరిగి అడవులకు పంపాలనే ఉద్దేశం తో మంకీ ఫుడ్ కోడ్స్ ఏర్పాటు చేసి వివిధ రకాల పండ్ల మొక్కలను నాటడం జరిగిందన్నారు జిల్లాలో 461 గ్రామ పంచాయతీలలో 1220 ఆవాస గ్రామాలు ఉన్నాయని 82 రైతు వేదికల ద్వారా రైతులను చైతన్య కార్యక్రమాలు చేపట్టామని పోస్టర్ల ద్వారా కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం కూడా చేస్తున్నామని రైతులు పునరాలోచన చేయాలన్నారు.
ఆరుతడి పంటలపై రైతాంగం దృష్టి పెట్టినందున నకిలీ విత్తనాలు మార్కెట్లో రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు నాణ్యమైన ధాన్యాన్ని విక్రయిస్తున్న అందుకు కలెక్టర్ రైతులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ సమ్మెట రాము వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్, ఉద్యాన శాఖ అధికారి సూర్యనారాయణ జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి మండల కో-ఆర్డినేటర్ మల్లారెడ్డి తాసిల్దార్ ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు
—————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post