ఆరుగాలం కష్టించే రైతు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోరాదు…

ప్రచురణార్థం

ఆరుగాలం కష్టించే రైతు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోరాదు…

మహబూబాబాద్ డిసెంబర్ -21:

భారత ప్రభుత్వ  ఆహార సంస్థ యాసంగి వరి పంటను కొనలేమని స్పష్టం చేసినందున ఆరుగాలం కష్టించి రైతు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందున రైతాంగం ప్రత్యామ్నాయ పంటలు చేపట్టి ఆర్థిక అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ శశాంక కోరారు.

మంగళవారం మరిపెడ మండలం లో కలెక్టర్ విస్తృతంగా పర్యటించి గిరిపురం రైతులకు అవగాహన కార్యక్రమంలో పాల్గొని మండల కేంద్రంలో లో వైద్య, ఆరోగ్య కేంద్రం తాసిల్దార్ కార్యాలయంలను తనిఖీ, మోడల్ మార్కెట్ ఆడిటోరియం నిర్మాణ పనులు పరిశీలన అనంతరం అబ్బాయిపాలెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శన కార్యక్రమాలను చేపట్టారు.

ముందుగా గిరిపురంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతుల అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.

 భారత ప్రభుత్వ ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ)యాసంగి వరిపంటను కొనుగోలు చేయలేమని స్పష్టం చేసినందున వరి పంట వేయరాదని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదన్నారు.

ఇప్పటికే గోదాములు నిండి ఉన్నాయని, ధాన్యం నిల్వ చేసే స్థలం కూడా లేదన్నారు. ఒకే పంటను చేపట్టడం ద్వారా  మార్కెట్లో డిమాండ్ తగ్గిపోయి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని,
ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు చేపట్టడం ద్వారా రైతులు లబ్ధిపొందుతారని తెలిపారు.

పంటల మార్పిడి  రైతుకు లాభదాయకమని పంట దిగుబడి పెరిగి అధిక ఆదాయం ఓనగూరుతుందన్నారు.

తదనంతరం మండల కేంద్రంలో   వైద్య ఆరోగ్య కేంద్రాన్ని, తాసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణను  పరిశుభ్ర పరచాలని, తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో లైట్లు ఏర్పాటు చేయాలని, సి సి రోడ్డు నిర్మించాలని అధికారులను ఆదేశించారు.

మరిపెడ మండల కేంద్రంలో నిర్మిస్తున్న కూరగాయల మోడల్ మార్కెట్ తోపాటు ఆడిటోరియం నిర్మాణాలను జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు తో కలిసి పనులను పర్యవేక్షించారు.  కూరగాయలు, మాంసం విక్రయ దారులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఆర్ డి ఓ రమేష్, జడ్పిటిసి తేజావత్ శారద రవీందర్, ఎంపీపీ గుగులోత్ అరుణ రాంబాబు, వైస్ ఎంపీపీ అశోక్ రెడ్డి, మున్సిపల్ ఈ ఈ రంజిత్, వ్యవసాయ సహాయ సంచాలకులు లక్ష్మీనారాయణ, తాసిల్దార్ రమేష్ బాబు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పి వి ఆర్ ఎన్ శాస్త్రి, గ్రామ కో ఆర్డినేటర్ సీతారామిరెడ్డి, రైతు కోఆర్డినేటర్  ఊకల గిరి యాదగిరి రెడ్డి గిరిపురం, అబ్బాయి పాలెం సర్పంచులు జనార్ధన్ జనకం మణి ఇద్దయ్య, ఏవో శోభన్ బాబు ఏఈవో రాధిక తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————————————————–
 జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ చే జారీ చేయడమైనది

Share This Post