ఆరోగ్యవంతమైన జీవనానికి అడవులను సంరక్షించుకోవాలని, అటవీ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

పత్రికా ప్రకటన                                                             తేదీ 8.11.2021

 

ఆరోగ్యవంతమైన జీవనానికి అడవులను సంరక్షించుకోవాలని, అటవీ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు అటవీ శాఖ అద్వర్యం లో జెడ్పి చైర్ పర్సన్ స్థానిక శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, అలంపూర్ శాసన సభ్యులు డా. అబ్రహం , సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం లో అటవీ సంరక్షణ, పోడు  భూముల పై సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయి లో బీట్ ఆఫీసర్ లు కమిటీ ఏర్పాటు చేసుకొని సమావేశాలు నిర్వహించి అటవీ సంరక్షణ పై చర్చించాలని, గ్రామ, మండల , డివిజన్, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలనీ, అందులో అటవీ , గిరిజన, రెవిన్యూ శాఖల నుండి సభ్యులు ఉంటారని , గ్రామాలలో ప్రజలకు అడవుల సంరక్షణ పై అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లా లో మొత్తం 1977.24 ఎకరాల  అటవీ భూమి ఉందని, గట్టు మండలం లోని పెంచికలపాడు, ముసోలోం పల్లి లో, ఎన్ఫోర్స్మెంట్ కు సంబంధించి 12 ఎకరాల అటవీ భూమి  ఉన్నట్లు తెలిపారు. 2005 కంటే ముందు 75 సంవత్సరాలుగా నివాసము ఉంటున్న గిరిజనులు ఆధారాలు (ఓటర్ కార్డు, ఆదార్ కార్డు) తీసుకొని, గ్రామ సభ లో అర్జీ చేసుకోవచ్చని , గిరిజనులు కాని వారు సైతం అర్హులని అన్నారు., గ్రామ స్థాయి లో అటవీ క్లెయిమ్ లు దాఖలు చేసిన తరవాత, అటవీ హక్కుల కమిటీ వాటి పరిశీలనకు షెడ్యూల్ ను సిద్ధం చేస్తుందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోషల్ ఫారెస్ట్రి హరిత హారం కార్యక్రమాన్ని సపోర్ట్ చేయాలనీ, అడవి ప్రాంతాన్ని సంరక్షించాలని పిల్లలు, పెద్దలు, ఎన్.సి.సి అందరిని హరిత హారం కార్యక్రమం లో  భాగస్వాములను చేసి మొక్కలు నాటించాలని అన్నారు.   యదాద్రి తరహాలో  మన జిల్లలో కూడా  ఇప్పటి నుండే ప్రణాళిక  సిద్దం చేసుకొని పెద్ద ఏ త్తున హరితాహారం చేయాలన్నారు.

జడ్ పి చైర్మన్ సరితా తిరుపతయ్య మాట్లాడుతూ ఎవరైతే పోడు  భూములపై ఆదారపడి జీవనం సాగిస్తున్నారో  వారు గ్రామ సభలో అర్జీ చేసుకోవచ్చన్నారు. అనుకూలమైన భూమి లోనే మొక్కలు నాటితే బాగుంటుందని అన్నారు.

స్తానిక శాశనసభ్యులు కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ  చాలా రోజుల నుండి స్తానికంగా ఉంటూ  భూమి  సాగు చేస్తున రైతులను గుర్తించి  అవకాశం కల్పించాలని కోరారు.  జిల్లా లో పెద్ద ఏ త్తున  మొక్కలునాటడం  జరిగిందని, ప్రతి ఇంటిలో కూడా మొక్కలు పెంచుతున్నారని  అన్నారు.

ఆలంపూర్ శాశనసభ్యులు డాక్టర్ అబ్రహం మాట్లాడుతూ జిల్లా లో 24 శాతం అటవీ ప్రాంతం ఉందని,  అటవీ భూములను సాగుచేసుకునే వారికీ ఉన్న సమస్యలను పరిష్కరించి వారి హక్కులను కాపాడాలని అన్నారు. అడవులను పెంచడం వలన వర్షాలు  బాగా పడతాయని , చెట్లను సంరక్షిస్తే అవి మనల్ని కాపాడతాయని అన్నారు.

సమావేశంలో  వైస్ చైర్మన్ సరోజమ్మ,అదనపు కలెక్టర్ లు రఘురాం శర్మ, శ్రీహర్ష,  ఆర్ డి ఓ రాములు, జాడ్పి సి ఇ ఓ విజయనయాక్, అటవీ శాఖ అధికారి టి.వి రామకృష్ణ,  ఎం పి పి విజయ్ , ప్రజా ప్రతినిధులు ,సంబందిత అధికారులు పాల్గొన్నారు.

 

—————————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్  గారిచే జారీ చేయబడినది.

 

Share This Post