ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణానికై వైద్య రంగానికి అధిక ప్రాముఖ్యత….. రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణానికై వైద్య రంగానికి అధిక ప్రాముఖ్యత….. రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

ప్రచురణార్థం

ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణానికై వైద్య రంగానికి అధిక ప్రాముఖ్యత….. రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.

మహబూబాబాద్, మే – 10:

ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణానికై వైద్య రంగానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చి అందుకు తగ్గ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.

మంగళవారం రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ కె. శశాంక, ఎం.పి. మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, రెడ్యా నాయక్, ఏమెల్సి రవీందర్ రావు, జెడ్పీ ఛైర్పర్సన్ అంగొతు బిందు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా ఆసుపత్రిలో పలు పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎన్.హెచ్.ఎం. నిధులు 70 లక్షల అంచనా వ్యయంతో రేడియాలజీ సర్వీస్ భవనం రెండవ అంతస్తు కు శంకుస్థాపన చేసి, హెచ్.ఎం. అండ్ ఎఫ్. డబ్ల్యూ నిధులు అంచనా విలువ 7.20 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రి అదనపు అంతస్తు, డి.ఎం.ఎఫ్.టి. నిధులు 54 లక్షల 20 వేల అంచనా విలువ తో నిర్మించిన 41 పడకల జనరల్ వార్డ్, ఎన్.హెచ్.ఎం. నిధులు 32.00 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన పిల్లల సంరక్షణ కేంద్రం (DPICU సెంటర్) ను ప్రారంభించారు.

అనంతరం సర్జికల్ విభాగంలో పేషంట్ లతో మంత్రి మాట్లాడుతూ, అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. సాధారణ ప్రసవాలు వలన ఎన్నో లాభాలు ఉన్నాయని, సిజేరియన్ ల వలన కలుగు నష్టాలను గర్భిణులకు తెలుపాలని మంత్రి వైద్య అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ డేవిడ్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్, డి.ఎం. అండ్ హెచ్. ఓ. హరీష్ రాజ్, జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్ వెంకట్రాములు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, డి ఎం ఈ రమేష్ రెడ్డి, హెల్త్ కమిషనర్ అజయ్ కుమార్,సి ఈ టి ఎస్ ఎం ఎస్ ఐ డి సి రాజేంద్ర కుమార్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post