ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం ప్రవేశ పెట్టిన ఆహారభద్రత పథకం అమలు పై కమిషన్ జిల్లాలో పర్యటించింది- రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ కే.తిరుమల్ రెడ్డి.

ఆగష్టు 26, 2021ఆదిలాబాదు:-

దేశం లో ఆకలి చవులు ఉండద్దని, ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ట్ర నిర్మాణం జరగాలని, ఆహారం కొరత ఎక్కడ ఉండద్దని ఉద్దేశంతో ఆహారభద్రత చట్టం ప్రభుత్వం అమలు పరుస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ కే.తిరుమల్ రెడ్డి అన్నారు. జిల్లాలో ఆహార భద్రత చట్టం అమలు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందుతున్న వైద్య సేవలు వంటి అంశాలను పరిశీలించడానికి గురువారం రోజున ఇచ్చోడ, ఇంద్రవెల్లి మండలాలలో కమిషన్ పర్యటించింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో 2013 సంవత్సరంలో ఆహార భద్రత చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, 2015 నుండి మన రాష్ట్రము లో ఈ చట్టాన్ని అమలు పరచడం జరుగుతున్నదని తెలిపారు. గ్రామీణ ప్రాంతం లోని 75 శాతం, పట్టణాల్లోని 50 శాతం బడుగు బలహీన వర్గాల ప్రజలకు నాణ్యమైన, సరసమైన ధరలకు సరుకులు అందించాలని చట్టంలో ఉందని, ఆ చట్టాన్ని అమలు పరచడం అధికారుల బాధ్యత అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ప్రతి ఒక్కరికి ఆరు కిలోల బియ్యం చొప్పున, ఒక రూపాయికే కిలో బియ్యం లబ్ది దారులకు అందజేయడం జరుగుతున్నదని తెలిపారు. ఆరోగ్యవంతమైన జన సంపదకు అంగన్వాడీల ద్వారా గర్భవతులకు, బాలింతలకు పౌష్ఠిక ఆహారం అందజేయడం జరుగుచున్నదని, అలాగే మూడు, ఆరు సంవత్సరాల పిల్లలకు కూడా పౌష్టికాహారం అందజేయడం జరుగుతున్నదని అన్నారు. మధ్యాహ్న భోజన కార్యక్రమం ద్వారా 14 సంవత్సరాల పిల్లలకు భోజనం అందించడం జరుగుతున్నదని తెలిపారు. బాలింతలకు మెటర్నిటీ బెన్ఫిట్ రూపేణా ఆహరం, ఇతరత్రా అవసరాలు తీర్చడానికి నగదు రూపేణా చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఈ అంశాలన్నింటినీ చట్ట బద్ధత కల్పిస్తూ, హక్కు రూపేణా పొందడం జరుగుచున్నదని అన్నారు. ఈ కార్యక్రమాల అమలును ఆదిలాబాద్ జిల్లాలో అమలు తీరును పరిశీలించేందుకు కమిషన్ పర్యటించిందని తెలిపారు. అందులో భాగంగా ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలింతలకు అందే నగదు లబ్ది చేకూరిందా అనే విషయాలను సిరికొండ మండలం సొన్ పెళ్ళి గ్రామానికి చెందిన వైశాలి, ఇచ్చోడ మండలం గుండాల గ్రామానికి బుస్రా బి లను కమిషన్ చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేద ప్రజానీకానికి అందిస్తున్న విద్య సేవలను మెడికల్ ఆఫీసర్ ను అడిగి తెలుసుకున్నారు. అంతరం ఇచ్చోడ మండల కేంద్రంలోని మూడవ నంబర్ చౌక ధరల దుకాణంలోప్రజాపంపిణీ ద్వారా సరఫరా చేస్తున్న బియ్యం, తదితర సరుకుల పంపిణి వివరాలను డీలర్ బి.ఊశన్న ను అడిగి తెలుసుకున్నారు. పంపిణి కి సంబంధించిన వివరాలు, అంత్యోదయ అన్నయోజన కార్డు ల ద్వారా పంపిణి చేస్తున్న బియ్యం, కార్డుల సంఖ్య వంటి వివరాలను తెలియపరుస్తూ, బోర్డులను ఏర్పాటు చేయాలనీ అన్నారు. లబ్ధిదారులు ఏ సమస్యపైనా అయినను ఫిర్యాదు చేయదలచిన వారి వివరాలను సెల్ నంబర్ లు వంటి బోర్డులను కూడా ఏర్పాటు చేయాలనీ అన్నారు. ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ప్రజాపంపిణీ జరుగుతున్న సమయంలో పరిశీలన చేయాలనీ అన్నారు. అనంతరం ఇచ్చోడ మండలం కామగిరి గ్రామం లోని అంగన్వాడీ కేంద్రాన్ని కమిషన్ పరిశీలించారు. ఈ సందర్బంగా విద్యార్థుల హాజరు, అందిస్తున్న పౌష్టికాహారం, బరువు, ఎత్తు కొలిచే విధానం, రికార్డుల నమోదు, అలాగే బాలింతలకు అందిస్తున్న ఆహారం, తదితర విషయాలపై అంగన్వాడీ కార్యకర్తలను, ఆయా లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి పిల్లలు, బాలింతల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ లు అన్ని అంశాలలో గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించాలని, ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని, తద్వారా ప్రభుత్వం ఆశించిన ప్రగతి సాధ్యం అవుతుందని అన్నారు. ఆ తర్వాత ఇంద్రవెల్లి మండల కేంద్రం లోని చౌక దరల దుకాణాన్ని పరిశీలించి బియ్యం నిల్వలు, పంపిణి వివరాలు సక్రమంగా నమోదు చేయాలనీ, అర్హులైన లబ్ధిదారునికి లబ్ది చేకూరాలని అన్నారు. అనంతరం జిల్లా పరిషత్ హై స్కూల్ ను పరిశీలించి పాఠశాల పునః ప్రారంభ ఏర్పాట్లను ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. కరోనా సమయంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద అందించిన వివరాలకు సంబంధించిన రిజిస్టర్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమాలలో కమిషన్ సభ్యులు కే.గోవర్ధన్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, జిల్లా విద్య శాఖ అధికారి ఏ.రవీందర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి సుదర్శనం, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్.భీమ్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ఇచ్చోడ ఎంపీపీ ప్రీతం రెడ్డి, ఆయా మండలాల తహసీల్దార్లు అతికొద్దిన్, రాఘవేందర్ రావు, సీడీపీఓ లు సౌందర్య, శ్రావణి, సర్పంచ్ లు తొడసం భీమ్ రావు, మెస్రం రేణుక, వివిధ శాఖల అధికారులు, పాఠశాలల అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post