ఆరోగ్యవంతమైన పల్లెలుగా తీర్చిదిద్దాలి…… జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ఆరోగ్యవంతమైన పల్లెలుగా తీర్చిదిద్దాలి…… జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

ఆరోగ్యవంతమైన పల్లెలుగా తీర్చిదిద్దాలి…… జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ముడుపుగల్
మహబూబాబాద్, జూన్ -04:

ఆరోగ్యవంతమైన పల్లేలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు.

పల్లె ప్రగతి కార్యక్రమం సందర్భంగా శనివారం జిల్లా కలెక్టర్ కె. శశాంక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి మహబూబాబాద్ మండలం ముడుపుగల్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పల్లె ప్రగతి కార్యాక్రమాలలో మౌళిక వసతులు పూర్తి చేసుకున్నందున గ్రామ పంచాయితీ సర్పంచ్ రమా, పంచాయితీ సెక్రటరీకి, గ్రామ పంచాయితీకి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. 400 కుటుంబాల గ్రామం ముడుపుగల్ లో దాదాపు రెండు వేల జనాభా ఉన్నదిని, మిగతా గ్రామాలతో పోల్చుకున్న సందర్భంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నారని, అంతకు ముందు మట్లాడిన వారు కూడా చాలా గర్వంగా చెప్పారు 80 లక్షల ఖర్చు చేసుకొని సి.సి. రోడ్దు వేసుకున్నామని, చాలా సంతోషమని, గ్రామంలోని పెద్దవాళ్లు 200 ఎకరాలకు పాస్ బుక్ లు రావాల్సి ఉందని, అంతకుముందున్న తహసిల్దార్, ఇప్పటి తహసిల్దార్ ఇట్టి విషయం తన దృష్టికి తీసుకవచ్చారని, ధరణిలో ఇప్పుడు ఆప్షన్ ఇవ్వడం జరిగిందని, పరిష్కరించుటకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలోని అన్ని ఇళ్లకు మిషన్ భగీరథ నీటిని వాడాలని, విద్యుత్ బిల్ తగ్గాలని, రక్షిత మంచినీరు తాగాలని మా ఉద్దెశ్యమని, మన జివిత కాలంలో ఎక్కువగా ఆరోగ్యం, చదువు కే ఖర్చు చేస్తామని, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు మనం త్రాగే నీటీతో వచ్చే వ్యాధులపైనే ఎక్కువగా ఖర్చు పెడుతున్నామని, ఇప్పుడు తాగుతున్న నీటి విషయమై 20 సంవత్సరాలు గడిచిన తర్వాత మోకాలు చిప్పలు అరిగిపోయాయని, నొప్పులు వస్తున్నాయని చెప్పడం జరుగుతుందని, కలుషితమైన నీరును త్రాగడం వలన వ్యాధులు వస్తాయని, కాబట్టి ఇటువంటి సమస్యలకు దురంగా ఉండేందుకు రక్షిత మంచినీరు శుధ్దమైన జలాన్ని ప్రజలు త్రాగాలనేది ప్రభుత్వం ఉద్దెశ్యం కాబట్టి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఇంటికి నల్ల పెట్టి ప్రజల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటున్నదన్నారు. ఇంటింటికి నల్లాలు అమర్చి శుద్ధమైన జలాలు అందించిన పథకం దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. మిగిలిన 32 జిల్లాల కంటే కూడా మన జిల్లాలో చాలా బ్రహ్మాండంగా మిషన్ భగీరథ జరుగుతున్నదని కలెక్టర్ గా నేను గర్వంగా చెపుతున్నానని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మౌళిక వసతులు కల్పించుకోవాలి అనే ఉద్దెశ్యంతోటి విద్యుత్, సాగునీరు, వ్యవసాయం పై ప్రత్యేక దృష్టి పెట్టి చేసుకుంటు వస్తున్నామని, మన ఊళ్లలో గతంలో కరెంట్ ఎలా ఉండేదోతెలుసునని, రాత్రిల్లు పోయి స్విచ్ ఆన్ చేసే రోజులు మనకు గుర్తు వున్నాయని, గతంలో ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కార్యక్రమాలను చేపడుతున్నారని, 2018 లో గ్రామీణ పంచాయితీ రాజ్ చట్టం తీసుకొచ్చారని, గ్రామాల అభివృద్ధితో సమూల మార్పులు తీసుకరావాలని ఉద్దెష్యంతో కొత్త చట్టం తీసుకొని రావడం జరిగిందని, దీని ప్రకారం ప్రతి గ్రామ పంచాయితీకి కొత్తగా పంచాయితీ సెక్రటరీ ఉండాలని వారిని కొత్తగా నియమించుకున్నామని, జిల్లాలో 461 గ్రామాలకు పంచాయితీ సెక్రటరీలు ఉన్నారని, గ్రమానికి కావలసిన పనులు చేయించుకొనుటకు, అడగడానికి ఉన్నారని, ముడుపుగల్ లో హరితహారం ద్వారా మొక్కలు నాటారని, సెగ్రిగేషన్ షెడ్, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఈ గ్రామానికి వచ్చిన మాకు ఇవన్ని చూసి చాలా గర్వంగా ఉందని, కాని వీటిని పూర్తిగా వంద శాతం ఉపయోగించుకోవాలని, ఊర్లో ఉన్న ప్రతి ఇంటి నుండి రోజు వారి చెత్త సేకరణ జరగాలని, సేకరించిన చెత్త తో సెగ్రిగేషన్ షెడ్ లో ఆదాయం పెంచుకోవాలని తెలిపారు. ఆరోగ్యంగా జీవించాలంటే గ్రామం మొత్తం పరిశుబ్రంగా ఉంచుకొని ఆరోగ్యవంతమైన పల్లెలుగా తీర్చిదిద్దాలని తెలిపారు

స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ అభిలాష మాట్లాడుతూ, గత నాలుగు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం లో చేపట్టిన వాటిని పూర్తిస్థాయిలో వినియోగం లోకి తీసుకురావాలని, గ్రామ కమిటీలు తరచూ సమావేశం అయి గ్రామంలో కావాల్సిన మౌలిక వసతులు పై చర్చించుకొని వసతులను మెరుగు పరుచుకోవాలని తెలిపారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించారు. మరుగుదొడ్డి సౌకర్యం లేనందున, ఏర్పాటు చేయాలని, అలాగే పశువుల దొడ్డి కొరకు ఉపయోగిస్తున్న స్థలాన్ని శుభ్రం చేసుకొని గ్రామపంచాయతీ అవసరాల నిమిత్తం వాడాలని, మరుగుదొడ్డి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

అనంతరం మన ఊరు మన బడి కింద జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో కావలసిన మౌళిక వసతులను పరిశీలించి, అంగన్వాడి పనీ తీరును అడిగి తెలుసుకున్నారు. బడిబాట కార్యక్రమం కింద గ్రామంలో బడి ఈడు పిల్లలు అందరూ పాఠశాలల్లో చేరాలని, ఈ సందర్భంగా మొదటి తరగతిలో చేరిన చిన్నారి రక్షితకు అడ్మిషన్ ఫామ్ ను అందజేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమ, జెడ్పీటీసీ ప్రియాంక, కో ఆప్షన్ మెంబర్ వెంకన్న, ఎంపిడిఓ వెంకట్ రెడ్డి, ఎం.పి. ఓ. హరిప్రసాద్, ఏ.పి.ఓ. ప్రదీప్, డి.ఆర్.డి. ఓ. సన్యాసయ్య, డి.పి. ఓ సాయి బాబా, పంచాయతీ సెక్రటరీ స్పందన, టెక్నికల్ అసిస్టెంట్ స్వప్న, ఏ. ఈ.ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post