ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం….. అదనపు కలెక్టర్ రాజర్షి షా

 

ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం….. అదనపు కలెక్టర్ రాజర్షి షా

సరైన పోషణతో ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా కోరారు

శుక్రవారం మహిళా ప్రాంగణంలోని సమావేశ మందిరంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ , అనుబంధ శాఖల అధికారులతో పోషన్ అభియాన్ జిల్లాస్థాయి కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజార్శి మాట్లాడుతూ ఈనెల 30 వరకు నిర్వహిస్తున్న పోషణ మాసంలో భాగంగా రక్తహీనత ,పౌష్టికాహార లోపం, తల్లిపాల ప్రాముఖ్యత, ఐదు సూత్రాల ను పాటించడం తదితర అంశాలపై మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. గర్భిణీలు, 0-6 సంవత్సరాల లోపు చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పోషన్ అభియాన్ కి సంబంధించి అన్ని పారామీటర్స్ పూర్తి చేయాలన్నారు.
ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా జిల్లాలో 75 పాఠశాలలో ఫ్రీడం రన్ చేస్తున్నారని, ఆ సమయంలో ఆయా పాఠశాలల వద్ద న్యూట్రిషన్ కు సంబంధించిన ప్లకార్డ్స్, బ్యానర్స్ కట్టించి అందరికీ అవగాహన కలిగేలా చూడాలన్నారు.

జిల్లాలో 1104 అంగన్వాడీ కేంద్రాలలో న్యూట్రి గార్డెన్స్ ను ఏర్పాటు చేశామన్నారు. వంద శాతం న్యూట్రి గార్డెన్స్ పూర్తి చేయాలని సూచించారు.

జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతుందని, పోషణ్ అభియాన్ తో పాటు, వ్యాక్సినేషన్ సర్వేలో భాగస్వాములై వంద శాతం పూర్తి చేయాలని అంగన్వాడి టీచర్లకు సూచించారు.
అంతకుముందు పోషణ అభియాన్ కు సంబంధించి న గోడ పత్రికను అదనపు కలెక్టర్ విడుదల చేశారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు.

సమావేశంలో శ్రీ శిశు సంక్షేమ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ శారద,జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి పద్మావతి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిపిఓ సురేష్ మోహన్, సి డి పి వో లు,డి సి పి ఓ రత్నం, అంగన్వాడీ టీచర్లు, మహిళా ప్రాంగణం కోఆర్డినేటర్, పోషణ్ బృందం, తదితరులు పాల్గొన్నారు.

Share This Post