ఆరోగ్య ఉప కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ బి గోపి .

గురువారం ఉదయం జిల్లాలోని వరంగల్, దుగ్గొండి మండలాలలో కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు.

ముందుగా వరంగల్లోని కాశిబుగ్గ లో గల సబ్ సెంటర్ ను కలెక్టర్ పరిశీలించి ఇప్పటివరకు వ్యాక్సినేషన్ పక్రియ ఎంతమందికి జరిగిందో అడిగి తెలుసుకున్నారు.

వ్యాక్సినేషన్ వేయించుకున్న వారి వివరాలు రిజిస్టర్ లో నమోదు చెసార లేదా అని కలెక్టర్ స్వయంగా రిజిస్టర్ ను పరిశీలించారు.

అనంతరం దుగ్గొండి మండలం లోని తొగర్రాయి గ్రామంలో గల సబ్ సెంటర్ ను పరిశీలించి వ్యాక్సినేషన్ కోసం వచ్చిన ప్రజలను ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు.

ఆసుపత్రి సరిపోవడంలేదని అదనపు గదులు కావాలని సిబ్బంది కలెక్టర్ తెలిపారు

అడిగిన వెంటనే కలెక్టర్ ఎస్టిమేషన్ వేసి వివరాలు పంపాల్సిందిగా డిఎంఅండ్హెచ్ఓ కు తెలిపారు.

అనంతరం వెంకటాపురం గ్రామంలో సబ్ సెంటర్ ను కలెక్టర్ పరిశీలించి అక్కడ ఉన్న ప్రజలను వ్యాక్సినేషన్ ఏర్పాట్లను, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు.

వెంకటాపూర్ లో 75% వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని డిఎంఅండ్హెచ్ఓ తెలపగా 100% పూర్తిచేసి… సర్పంచులు, ఎంపీటీసీలు 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లుగా ప్రకటించి బోర్డు పెట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు.

వెంకటాపూర్ లో మిషన్ భగీరథ పనులకు కలెక్టర్ శంకుస్థాపన చేశారు.

వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూదానం చేసిన రైతు రామారావును కలెక్టర్ సన్మానం చేశారు

అనంతరం దుగ్గొండి మండల లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అన్ని వార్డులను పరిశీలించి ఆసుపత్రి పరిసర ప్రాంతాలు ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు.

కలెక్టర్ సిబ్బందితో సమావేశపరిచి పలు సూచనలు చేశారు

ఆసుపత్రికి వచ్చిన ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.

వ్యాక్సినేషన్ కొరకు వచ్చిన ప్రజల నుండి వివరాలు సేకరించారు.

ఈ కార్యక్రమంలో డిఎంఅండ్హెచ్ఓ వెంకటరమణ, డిప్యూటీ DMHO ప్రకాష్, MPP కె. కోమల, ఎంపీడీవో కృష్ణ ప్రసాద్, డాక్టర్లు క్రాంతి కుమార్, రాజు మరియు ప్రజా ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post