ఆరోగ్య కేంద్రాలలో వారానికి ఒక రోజు వయోవృద్దులకు వైద్యసేవలు

ఆరోగ్య కేంద్రాలలో వారానికి ఒక రోజు వయోవృద్దులకు వైద్యసేవలు

  • ఘనంగా ప్రపంచ వయోవృద్దుల దినోత్సవం
  • జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్

0 0 0 0

     జిల్లాలోని అన్ని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వారానికి ఒకరోజు వయోవృద్దులకు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు.

 

     శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రపంచ వయోవృద్దుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలు శిశు, వికాలాంగులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ ముఖ్యఅతిధిగా పాల్గోన్నారు.  ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వయో వృద్దుల సంక్షేమ చట్టం ద్వారా వారికి సత్వర న్యాయం జరిగే అవకాశం ఉందని అన్నారు.   ఈ చట్టం ప్రకారం సంరక్షణకు, నిరాదరణకు గురైన వయోవృద్దులు రెవెన్యూ డివిజనల్ అధికారికి సాదారణ ధరఖాస్తు సమర్పిస్తే చాలని తెలిపారు.  సమస్యలు పరిష్కారం కాకపోతే అప్పిలేట్ అధికారిగా ఉన్నతాధికారులకు ధరఖాస్తు సమర్పించాలని తెలిపారు.  అయితే కొంతమంది భూతగాదాలను కూడా ఈ చట్టం ద్వారా ఆశ్రయిస్తున్నారని ఇది సరికాదని అన్నారు.  ఈ చట్టాన్ని దుర్వీనియోగం చేయరాదని తెలిపారు.  తల్లితండ్రులు పిల్లలకు ఆస్థులను గిఫ్ట్ డీడ్ చేసినప్పుడు అందులో తప్పనిసరిగా షరతులను పెట్టాలని తెలిపారు.  భవిష్యత్తులో పిల్లలు పట్టించుకోని  పక్షంలో ఈ గిఫ్ట్ డీడ్ చెల్లదని ముందే దస్తవేజుల్లో పేర్కోనాలని సూచించారు.  అప్పుడే ఆ గీఫ్ట్ డీడ్ ను రద్దు చేయవచ్చని అన్నారు.  అనంతరం వివిధ రంగాలలో సేవలు అందించిన, అందిస్తున్న వయోవృద్దులను జిల్లా కలెక్టర్ సన్మానించారు.

 

     ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జి.వి. శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, ఆర్డిఓ ఆనంద్ కుమార్, జిల్లా శిశు సంక్షేమ అధికారి సభిత, జిల్లా వైద్యాధికారి జువేరియా, జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్ రావు,  వయోవృద్దుల సంక్షేమ సంఘాల బాద్యులు సముద్రాల జనార్దన్ రావు, వడ్లూరి వెంకటేశం, సత్తయ్య, మోసం అంజయ్య, పెండాల కేశవరెడ్డి,  తొడుకునూరి బిక్షపతి, మహ్మద్ హబీబ్,  చంద్రయ్య,  నారాయణ రెడ్డి,  నరశింహ రెడ్డి, మహ్మద్  హుస్సేన్ తదితరుల పాల్గోన్నారు.

Share This Post