ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం….. జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ కంటి వెలుగు దేశంలో ఎక్కడా లేని అద్బుతమైన కార్యక్రమం ….. చింతా ప్రభాకర్ సదాశివపేట మండలం ఆత్మకూరు పీహెచ్సీలో కంటివెలుగు శిభిరాన్ని ప్రారంభించిన జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం….. జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ

కంటి వెలుగు
దేశంలో ఎక్కడా లేని అద్బుతమైన కార్యక్రమం
….. చింతా ప్రభాకర్

సదాశివపేట మండలం ఆత్మకూరు పీహెచ్సీలో కంటివెలుగు శిభిరాన్ని ప్రారంభించిన జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్

అంద:త్వ
నివారణ తెలంగాణను రూపొందించడమే లక్ష్యంగా ప్రజలకు కంటి సమస్యలు ఉండరాదన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి పేర్కొన్నారు.

గురువారం సదాశివపేట మండలం ఆత్మకూర్ గ్రామ పి హెచ్ సి లో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిభిరాన్ని జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ , రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ లు
జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ మాట్లాడుతూ దృష్టి లోపంతో ఎవరు ఇబ్బందులు ఎదుర్కోకుండా రాష్ట్ర వ్యాప్తంగా కంటివెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.

చూపు లేని వారికి చూపు వస్తుందని నమ్మకం కలిగేలా ఆత్మకూర్ పీహెచ్సీ ఆసుపత్రిని చూస్తేనే తెలిసిపోతుందన్నారు. కళ్ళు బాగుంటే చివరి వరకు జీవితం బాగుంటుందన్నారు. కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేసుకునేలా అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు.

గ్రామంలోని వృద్ధులను ప్రత్యేకించి దగ్గరుండి తీసుకువచ్చి శిబిరంలో చూపించాలని సూచించారు. వాతావరణ పరిస్థితులు, ఇతర అలవాట్లతో పిల్లలకు కంటి జబ్బులు వస్తున్నాయని, మొదట్లోనే గమనించి చూపించాలన్నారు.

రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ మాట్లాడుతూ
ఇది ఒక పండగ రోజు అని, ప్రపంచానికే ఆదర్శంగా కంటి వెలుగు కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. కెసిఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదన్నారు.

కంటివెలుగు కార్యక్రమం ద్వారా చూపు మందగించిన వారికి పైసా ఖర్చు లేకుండా కంటివెలుగు శిభిరాల రూపంలో మీఊరికే,మీ వద్దకె వచ్చి కంటి పరీక్షలను నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి వెంటనే రీడింగ్ కళ్లాద్దాలను అందించడం జరుగుతుందన్నారు. సమస్య మరిఎక్కువగా ఉన్నవారికి ప్రిస్కైబ్డ్ కళ్లాద్దాలను శిభిరం నుండే ఆర్దర్ చేసి ఆశా, ఎఎన్ఎంల ద్వారా ఇంటికే పంపించడం జరుగుతుందని తెలిపారు. ఆపరేషన్ అవసరం ఉన్నవారికి మెరుగైన వైద్యం కొరకు ఆసుపత్రులకు పంపించడం జరుగుతుందని తెలిపారు.

ప్రతి వార్డు సభ్యులు తమ వార్డులలో ఉన్న వారందరినీ తీసుకువచ్చి పరీక్షలు చేయించాలని కోరారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ, వెలుగు నిచ్చే కార్యక్రమం కంటి వెలుగుని, దేశంలో ఎక్కడా కంటిచూపు కొరకు ప్రత్యేకంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయలేదని, మన రాష్ట్రంలో మాత్రమే కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

ఒకప్పుడు కంటికి డాక్టర్ దొరికే వారు కాదని అలాంటిది మీ ఊరికే మిషన్ తో సహా డాక్టర్లే స్వయంగా పరిశీలించడానికి వచ్చారని అన్నారు.

జిల్లాలో ప్రతిఒక్కరికి కంటిపరీక్షను నిర్వహించేలా 69 టీంలతో కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగిందని పేర్కోన్నారు. ఇప్పటికే 64 వేలకు పైగా కళ్లద్దాలను తెప్పించామన్నారు.

18 సంవత్సరాలు పైబడిన వారందరు కంటివెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కంటి విషయంలో అలసత్వం వహించొద్దని, మొదట్లోనే పరీక్షించుకుని కళ్ళను కాపాడుకోవాలని సూచించారు. అధికారులు ప్రజాప్రతినిధులు సంయుక్తంగా కలిసికట్టుగా పనిచేయాలన్నారు.

శిభిరంలో కంటిపరీక్షలు చేయించుకున్న లబ్ధిదారులు చాకలి రాములు,చంద్రకళ కు రీడింగ్ గ్లాసెస్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రమణ కుమార్, అదనపు కలెక్టర్ రాజర్షి షా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. గాయత్రీ దేవి, మండల ప్రత్యేక అధికారి సునీత, ఎంపీడీవో పూజ, తహసిల్దార్ , రైతుబంధు మండల కోఆర్డినేటర్ అమరేందర్, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ఎంపీటీసీ, ఎంపీపీ, మాజీ సర్పంచులు, అధికారులు వైద్య సిబ్బంది, పంచాయితీ, ఐకెపి సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post