ఆరోగ్య భారత్ ను ఏర్పాటు చేద్దాం… అదనపు కలెక్టర్ రాజర్షి షా ఆరోగ్య భారత్ కోసం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు అరగంటపాటు వ్యాయామం చేయాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు.

 

ఆరోగ్య భారత్ ను ఏర్పాటు చేద్దాం… అదనపు కలెక్టర్ రాజర్షి షా
ఆరోగ్య భారత్ కోసం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు అరగంటపాటు వ్యాయామం చేయాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు.

ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని ఐ బి నుండి అంబేద్కర్ స్టేడియం వరకు నిర్వహించిన ఫిట్ ఇండియా వాకథాన్ ను రాజర్షి జెండా ఊపి ప్రారంభించారు.

వాకథాన్ లో 75 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శిస్తూ, 75 మంది స్వతంత్ర సమరయోధుల ఫోటోల ప్ల కార్డ్స్ ను ప్రదర్శిస్తూ జాతీయ నినాదాలతో పెద్ద ఎత్తున వాకథాన్ నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజర్షి మాట్లాడుతూ దేశ సమగ్రత, జాతీయ సమైక్యత కోసం ప్రజలలో అవగాహన కల్పించేందుకు
వాకథాన్ ఉపయోగ పడుతుందన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట యువత, దేశ ప్రజల్లో దేశభక్తిని, జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జిల్లాలో 75 పాఠశాలల్లో విద్యార్థులు ,ఉపాధ్యాయులు యువతతో వాకథాన్, ర్యాలీలు నిర్వహించడం జరిగిందన్నారు.

ప్రతి పౌరుడు రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులతో పాటు బాధ్యతలను సక్రమంగా నిర్వహించినప్పుడే సమర్థవంతమైన సమాజం
ఏర్పడుతుందన్నారు.

ఆరోగ్యవంతమైన సమాజం తోనే దేశాభివృద్ధి ముడిపడి ఉందన్నారు. ఆ దిశగా అందరూ దృష్టి సారించాలన్నారు.

అనంతరం ఆయన వాకథాన్ లో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, జెడ్పీ సి ఈ ఓ ఎల్లయ్య, డీఈవో రాజేష్, యువజన సంక్షేమ అధికారి జావిద్ అలీ, డిఎస్పీ బాలాజీ, డి ఆర్ డి ఓ శ్రీనివాస రావు, అనుబంధ శాఖల అధికారులు, నెహ్రూ యువ కేంద్ర ఉమ్మడి జిల్లా అధికారి బెన్సీ, ఉపాధ్యాయులు, మహిళా సంఘాల మహిళలు, పోలీస్ శాఖ అధికారులు, విద్యార్థులు,
ఎన్ ఎస్ ఎస్,
ఎన్.సి.సి. కేడెట్స్, అధికారులు, ఎన్వైకె వాలంటీర్లు అనిల్ కుమార్, అజయ్ యాదవ్, సాయి రామ్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post