ఆరోగ్య మహిళా కేంద్రాల ద్వారా మహిళలకు సంపూర్ణ ఆరోగ్యం – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ

ఆరోగ్య మహిళా కేంద్రాల ద్వారా మహిళలకు సంపూర్ణ ఆరోగ్యం – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం

ఆరోగ్య మహిళా కేంద్రాల ద్వారా మహిళలకు సంపూర్ణ ఆరోగ్యం – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ

*ప్రతి మంగళవారం ఆరోగ్య కేంద్రాలలో ప్రత్యేకంగా మహిళలకు ఆరోగ్య సేవలు, 8 విభాగాల్లో పరీక్షల నిర్వహణ

*ఆరోగ్య మహిళా కేంద్రాల పట్ల ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు విస్తృత ప్రచారం చేయాలి
——————————————————-
రామగుండం, పెద్దపల్లి జిల్లా, మార్చి – 21:
——————————————————-
రాష్ట్ర ప్రభుత్వం మహిళలను సంపూర్ణ ఆరోగ్యవంతులు చేయడమే లక్ష్యంగా ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అన్నారు.

మంగళవారం రామగుండంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

జిల్లా కలెక్టర్ ఆరోగ్య కేంద్రానికి వచ్చిన మహిళలతో మాట్లాడుతూ, మహిళా ఆరోగ్య కేంద్రాల ద్వారా 8 విభాగాల్లో మహిళలకు అవసరమైన పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్దారణ జరిగిన వారికి తదుపరి చికిత్సను పూర్తి ఉచితంగా అందించేందుకు ఆరోగ్య మహిళా కేంద్రాలు దోహదపడతాయని అన్నారు.

మహిళ ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం అనే లక్ష్యంతో మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రత్యేకంగా 100 ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించింద ని, ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో 3 ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నామని కలెక్టర్ తెలిపారు.

అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు ఆరోగ్య మహిళా కేంద్రం నిర్వహణ పట్ల విస్తృత ప్రచారం నిర్వహించి, మహిళలందరికీ వైద్య సేవలు అందే విధంగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఆరోగ్య మహిళా కేంద్రాలకు వచ్చిన మహిళలతో కలెక్టర్ ఇంట్రాక్ట్ అవుతూ, మహిళలకు ఆరోగ్య మహిళా కేంద్రాల ద్వారా 8 విభాగాల్లో పరీక్షలను చేయడం జరుగుతుందని తెలిపారు. ఆలాగే వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.

ప్రాథమిక డయాగ్నాస్టిక్, క్యాన్సర్ స్క్రీనింగ్, సూక్ష్మ పోషక లోపాలు, మూత్ర నాళ ఇన్ఫెక్షన్ లు, పి.ఐ.డి., పిసిఓఎస్., కుటుంబ నియంత్రణ, రుతుస్రావ సమస్యలు, మెనోపాజ్ మేనేజ్మెంట్, లైంగిక వ్యాధులు, శరీర బరువు అంశాలు ఆరోగ్య కేంద్రంలో పరీక్షించడం జరుగుతుందని తెలిపారు.

మహిళలల్లో ఉన్న పోషకాహార లోపం నివారణ కోసం క్లినిక్ లో అవసరమైన పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందిస్థున్నట్లు, క్లినిక్ కు వచ్చే మహిళల వివరాలను ప్రత్యేక యాప్ లో పకడ్బందీగా నమోదు చేయాలని, యాప్ లో నమోదు చేస్తున్న వివరాలను పరిశీలించారు. అవసరమైన వైద్య చికిత్సల కోసం రిఫరల్ చేసిన కేసులను ఆశా కార్యకర్తల ద్వారా ఫాలోఅప్ చేయాలని కలెక్టర్ సూచించారు.

మహిళలు ఆరోగ్య మహిళా కేంద్రంలో ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆరోగ్య మహిళా కేంద్రం ఇంచార్జీ డాక్టర్ మాధురీ, మునిసిపల్ కమిషనర్ సుమన్ రావు, ఏ.ఎన్.ఎం.లు, ఆశాలు, డాటా ఎంట్రీ ఆపరేటర్ లు, సంబంధిత సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
——————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

Share This Post