ఆరోగ్య మహిళ కేంద్రాలకు వచ్చే మహిళలకు అన్ని పరీక్షలను టీ డయాగ్నస్టిక్ ద్వారా పూర్తి చికిత్సను అందించాలి

ఆరోగ్య మహిళ కేంద్రాలకు వచ్చే మహిళలకు అన్ని పరీక్షలను టీ డయాగ్నస్టిక్ ద్వారా పూర్తి చికిత్సను అందించాలి

 

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

00000

 

ఆరోగ్య మహిళ కేంద్రాలకు వచ్చే మహిళలకు అన్ని పరీక్షలను టీ డయాగ్నస్టిక్ ద్వారా పూర్తి చికిత్సను అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

 

     శనివారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లాలో ఆరోగ్య మహిళ కార్యక్రమం అమలు తీరును జిల్లాస్థాయి అధికారులతో సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఈ కార్యక్రమం సమర్థవంతంగా అమలు అవుతుందని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అభినందనలు తెలియజేశారని అన్నారు. కరీంనగర్ జిల్లాలో మహిళలు ఎక్కువ సంఖ్యల్లో పరీక్షలు నిర్వహించుకొని జిల్లాలో రిఫరల్ సర్వీసెస్ ను ఉపయోగించుకున్నట్టు వారు తెలియజేశారుని అన్నారు. ఆరోగ్య మహిళా కేంద్రాలకు వచ్చే మహిళలకు అన్ని పరీక్షలను టీ డయాగ్నోస్టిక్ ద్వారా చేయించాలని పూర్తి చికిత్సను అందించాలని సూచించారు. 8 ఆరోగ్య సమస్యలను గుర్తించి చికిత్స అందించడం జరుగుతుందని అవి సూక్ష్మ పోషక లోపాలు’ శారీర బరువు నిర్వహణ, క్యాన్సర్ స్క్రీనింగ్, రొమ్ము క్యాన్సర్, మెనోపాజ్ నిర్వహణ, మూత్రనాల ఇన్ఫెక్షన్, రుతుస్రావ సమస్యల నిర్వహణ, సుఖ వ్యాధులు, మొదలైనవి ఈ కార్యక్రమమును ఇంకా సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రధాన శాఖలు ఆరోగ్య మెప్మా మార్కెటింగ్ డిఆర్డిఏ,పట్టణ మున్సిపాలిటీలు శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని మహిళలు ఉపయోగించుకునే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ అధికారులను కోరారు.

ఈ సమావేశంలో జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, జిల్లా సంక్షేమ అధికారి సబితా, జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మావతి, పిడి మెప్మా రవీందర్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Share This Post