ఆరోగ్య లక్ష్మి పాలు, ఆరోగ్య లక్ష్మి మొబైల్ యాప్ లను ఆవిష్కరించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

హైదరాబాద్, జనవరి :03

రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తండ్రివలె మనసుపెట్టి ఆలోచించే గౌరవ కేసీఆర్ గారు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే ఈ రాష్ట్రంలో మహిళలకు, పిల్లలకు ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ లో నేడు ఆరోగ్య లక్ష్మీ పాలు, ఆరోగ్యలక్ష్మీ మొబైల్ యాప్ ను మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, మహిళా సహకార, అభివృద్ధి కార్పోరేషన్ చైర్ పర్సన్ శ్రీమతి ఆకుల లలిత, కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి దివ్య దేవరాజన్, ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు.

————————————-

Share This Post