ఆరోగ్య లక్ష్మి పాలు, ఆరోగ్య లక్ష్మి మొబైల్ యాప్ లను ఆవిష్కరించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

మనసున్న సీఎం మన కేసిఆర్

అంగన్వాడీలకు ఏడెళ్ళల్లో మూడుసార్లు వేతన పెంపు..30 శాతం పి.ఆర్.సి అమలు

అంగన్వాడిల సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వ అవార్డులు

అంగన్వాడీలు మరింత మనసు పెట్టి తల్లుల వలె పని చేయాలి

దేశంలో అంగన్వాడీల ద్వారా తల్లలు,గర్భిణీ స్త్రీలకు పాలు అందిస్తున్న రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే

ఆరోగ్య లక్ష్మి పాలు, ఆరోగ్య లక్ష్మి మొబైల్ యాప్ లను ఆవిష్కరించిన

రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

హైదరాబాద్, జనవరి-03:

రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తండ్రివలె మనసుపెట్టి ఆలోచించే గౌరవ కేసీఆర్ గారు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే ఈ రాష్ట్రంలో మహిళలకు, పిల్లలకు ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ లో నేడు ఆరోగ్య లక్ష్మీ పాలు, ఆరోగ్యలక్ష్మీ మొబైల్ యాప్ ను మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, మహిళా సహకార, అభివృద్ధి కార్పోరేషన్ చైర్ పర్సన్ శ్రీమతి ఆకుల లలిత, కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి దివ్య దేవరాజన్, ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి మాటలు….

రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

కొత్త సంవత్సరంలో మహిళల ఆరోగ్యం కోసం పాటుపడే పాలను, అంగన్వాడీ సేవలను పటిష్టం చేసే ఆరోగ్య లక్ష్మీ మొబైల్ యాప్ ను ఆవిష్కరించుకునే మంచి కార్యక్రమం ఇది.

రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలు, తల్లులకు ఇచ్చే పాలు పక్క దారి పట్టవద్దని…తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దని ఈ ఆరోగ్యలక్ష్మీ పేరుతో పాల ప్యాకెట్లు ముద్రించి పంపిణీ చేస్తున్నాం.

మన కమిషనర్ దివ్య గారు చాలా మనసు పెట్టి పని చేస్తున్నారు. లబ్ధిదారులకు మేలు జరిగే విధంగా సమర్థవంతంగా పనులు నిర్వహిస్తున్నారు.

గతంలో కొవిడ్ సందర్భంగా పాల పాకెట్స్ తక్కువ అయితే విజయ డైరీ నుంచి 10 వేల పాకెట్స్ మన కోసం ముద్రించారు. అయితే అవి బయటి మార్కెట్ లోకి వెళ్తే వారిపై కేసు పెట్టి లబ్దిదారులకు అందే ప్రయోజనాలు కాపాడేందుకు బలంగా కొట్లాడారు.

దేశంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు మాత్రమే అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీ స్త్రీలు, తల్లులకు పాలు ఇస్తున్నాయి.

సీఎం కేసిఆర్ గారు తండ్రివలె ఆలోచించి రాష్ట్రంలోని పేదలకు అంగన్వాడి ల ద్వారా మేలు జరగాలని కరోనా కష్ట కాలంలో కూడా ఒక పూట అందించే విధంగా ఇంటింటికీ రేషన్ ఇవ్వాలన్నారు.

కరోనా ముందు 17 లక్షల లబ్దిదారులు ఉంటే…కరోనా కష్టకాలంలో లబ్దిదారులు పెరగడంతో 25 లక్షల మందికి మన అంగన్వాడీల ద్వారా ఇంటింటికి రేషన్ అందించాం.

మనం చేసిన సేవలను గుర్తించి, కేంద్రం అవార్డు కూడా ఇచ్చింది.

మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లి కూడా రేషన్ అందించాము. మహబూబాబాద్ లో ట్రాలీలో వస్తువులు పెట్టుకుని ఇంటింటికీ వెళ్లి అంగన్వాడీ సరుకులు ఇవ్వడం చూసినప్పుడు మన అంకితభావం కనిపించింది.

మహిళలకు ఒక పూట వేడి వేడి భోజనం పెట్టి, పాలు అందించేందుకు ఆరోగ్య లక్ష్మీ పథకాన్ని అమలు చేస్తున్న మన సీఎం కేసిఆర్ గారికి ఈ రాష్ట్ర మహిళలమంతా రుణపడి ఉంటాం.

మహిళలకు అనేక సేవలు అందిస్తున్నందుకు ఏడేళ్ళలో మూడుసార్లు గౌరవ వేతనం పెంచారు, 30 శాతం పి.ఆర్.సి ఇచ్చారు.

గతంలో అంగన్వాడీలకు రెండు, మూడు నెలలకొకసారి జీతాలు వచ్చేవి కావి. కానీ ఇప్పుడు ప్రతి నెల వేతనాలు వస్తున్నాయి. త్వరలో ప్రతి నెల 5వ తేదిలోపు వేతనాలు ఇచ్చే కృషి చేస్తాం.

ఈ కుటుంబ పెద్దగా మీకోసం ఎప్పుడు పని చేస్తాను…మీరు మనసు పెట్టి నిజాయితీగా పనిచేయడమే మీనుంచి నేను కోరుకునేది.

చైర్ పర్సన్ శ్రీమతి ఆకుల లలిత గారి మాటలు…

సీఎం కేసిఆర్ గారు నాకు ఈ పదవి ఇచ్చి, రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశము కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారికి ధన్యవాదాలు.

అంగన్వాడీలకు, మహిళలకు ఈ కొత్త సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.

మన అంగన్వాడిలు మంచి పని చేస్తున్నారు.

అంగన్వాడీలు చేస్తున్న సేవలను గుర్తించి, నిజామాబాద్ జిల్లాలో వారికి సన్మానం చేశాం.

తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలో మహిళా ప్రాంగణాలు ఉన్నాయి. వీటిని విస్తరించడం, మహిళకు మరింత ఉపాధి కల్పించే కొత్త కోర్సులు పెట్టాలనే ఆలోచన చేస్తున్నాం.

కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి దివ్య దేవరాజన్ గారి మాటలు…

నూతన సంవత్సరంలో ఆరోగ్య లక్ష్మి పథకం కింద నూతన పాల పాకెట్ల విడుదల చేయడం ఒక మంచి కార్యక్రమం.

మార్కెట్లో అమ్మే ప్యాకెట్స్ కు మన ప్యాకెట్స్ కు స్పష్టమైన తేడా కనిపించే విధంగా… చూడగానే అంగన్వాడి పాల పాకెట్స్ అని గుర్తించే విధంగా వీటిని డిజైన్ చేశాం

ప్రభుత్వం ఇచ్చే పాలు పక్కదారి పట్టకుండా ఉండడం…ప్రభుత్వం చాలా ఖర్చు పెట్టి ఇస్తున్న పాలు అని లబ్ధిదారులకు తెలియజేయడం దీని ఉద్దేశ్యం

దేశంలో తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు మాత్రమే అంగన్వాడిలకు పాలు ఇస్తున్నాయి.

ఆరోగ్య లక్ష్మీ మొబైల్ యాప్ ద్వారా అంగన్వాడీలు నిర్వహించే 14 రిజిస్టర్ల బాధ తప్పుతుంది. లబ్దిదారులు, సరుకులు, హాజరు విషయంలో సంపూర్ణ పారదర్శకత వస్తుంది. పనిలో వేగం పెరగడంతో పాటు లబ్దిదారులకు ప్రయోజనం కూడా సకాలంలో మరింత సమర్థవంతంగా కలుగుతుంది.

ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు లక్ష్మీ, సునంద, కార్పోరేషన్ సంయుక్త సంచాలకులు సబిత, టి.ఎస్ ఫుడ్స్ ఉన్నతాధికారులు విజయలక్ష్మీ, కృష్ణవేణి, శ్రీనివాస్ నాయక్, వివిధ జిల్లాల సంక్షేమ అధికారులు, ఎన్.ఐ.సి రాష్ట్ర హెడ్ రాజశేఖర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
———————————————————————–

Share This Post