ఆర్టీపిసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

ప్రచురణార్దం-2
జనగామ, డిసెంబర్ 4: ఆర్టీపిసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. శనివారం జనగామ జిల్లా ఏరియా ఆసుపత్రిలోని ఆర్టీపిసీఆర్ ల్యాబ్ ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కరోనా కొత్త రకం వైరస్ వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రజలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు తదితర జన సంచారం అధికంగా ఉన్న ప్రదేశాలలో ప్రజలు బౌతిక దూరం పాటిస్తూ, శానిటైజేషన్ చేసుకుంటూ తప్పనిసరిగా మాస్క్ ధరించి జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఎలాంటి అనుమానాలు, అనారోగ్య సమస్యలు ఉన్నా స్వచ్చందంగా వచ్చి టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు. రోజుకు 300 ఆర్టీపిసీఆర్ టెస్టులు చేసే లక్ష్యంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రతి జన సంచారం కలిగిన ప్రతి ప్రదేశంలో కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ తనిఖీలో కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి డా. ఏ. మహేందర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. పి. సుగుణాకర్ రాజు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు వున్నారు.

Share This Post