ఆర్టీపీసీఆర్ ల్యాబ్ ఏర్పాటు పనుల్లో వేగం పెంచాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రచురణార్థం-2
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 13: కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అవసరమైన ఆర్టీపీసీఆర్ ల్యాబ్ ఏర్పాటు పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం కలెక్టర్ సిరిసిల్ల పట్టణంలోని పొదుపు భవన్ లో ఏర్పాటు చేస్తున్న ఆర్టీపీసీఆర్ ల్యాబ్ పనుల ప్రగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ల్యాబ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి వచ్చే నెల 1 వ తేదీ నుండి జిల్లాలో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు మన జిల్లా నుండి శాంపిల్స్ ను వాహనాల్లో హైదరాబాద్ కు పంపే వాళ్ళమని, ఆ రిపోర్ట్ మరుసటి రోజు వచ్చేదని అన్నారు. రోజుకు పరిమిత సంఖ్యలో మాత్రమే పరీక్షలకు శాoపిల్స్ పంపే అవకాశం ఉండేదని, జిల్లాలో ల్యాబ్ ఏర్పాటుతో ఇక ఆ ఇబ్బంది ఉండదని ఆయన తెలిపారు. ల్యాబ్ ఏర్పాటు వలన ఇకనుండి మన జిల్లాలోనే స్థానికంగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసేందుకు వీలుగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. సుమన్ మోహన్ రావు, తదితరులు ఉన్నారు.

Share This Post