ఆర్టీసీ ఆదాయ మార్గాలు పెంచుకుని ఆర్టీసీని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి . శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఏం చేస్తే ఆర్టీసీకి ఆదాయం వస్తుందో ఆలోచించాలని ఆర్టీసీ ఉద్యోగులకు ఆయన పిలుపునిచ్చారు.

పత్రికా ప్రకటన                                                    మహబూబ్ నగర్
27. 7 .2021
___________

ఆర్టీసీ ఆదాయ మార్గాలు పెంచుకుని ఆర్టీసీని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి . శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఏం చేస్తే ఆర్టీసీకి ఆదాయం వస్తుందో ఆలోచించాలని ఆర్టీసీ ఉద్యోగులకు ఆయన పిలుపునిచ్చారు.
మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ టి సి బస్టాండ్ వద్ద హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఆర్టీసీ పట్ల ప్రజల్లో భరోసా పెంచాలని, ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ కు రాగానే ప్రయాణికుల్లో మంచి నమ్మకాన్ని పెంపొందించే దిశగా పరిసరాలు,శుభ్రమైన బస్సులు, క్యాంటీన్ ఉండాలని, బస్టాండ్ ప్రవేశ మార్గము పరిశుభ్రంగా, విశాలంగా ఉంచాలని, బస్టాండ్ పేరు బాగా కనిపించేలా పెద్ద నేమ్ బోర్డును ఏర్పాటు చేయాలని, అదేవిధంగా క్యాంటీన్ ను నూతనంగా తీర్చిదిద్దాలని, ఆయన ఆర్టీసీ ఆర్ఎం, డి ఎం లకు సూచించారు.
అంతేకాక ఆర్ టి సి ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్టాండ్ పరిపాలనా భవనం పై మరో అంతస్తును నిర్మించాలని, అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ లు ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని, లోపాలను సరిదిద్దుకుని ముందుకు వెళితే మంచి ఆదాయం వస్తుందని అన్నారు. ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా కూడా ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు .
ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటుచేసిన హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కాగా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ స్కూల్ కేంద్రం ద్వారా 20 మంది శిక్షకులకు ఉచిత భోజన, వసతితో పాటు శిక్షణ ఇచ్చేందుకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 53300 రూపాయలను ఖర్చు చేయనున్నారు .నెలరోజులపాటు ఇస్తున్న ఈ శిక్షణకు సీనియర్ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ఆర్ టి సి ఆర్ ఎం ఉష దేవి, డి ఎం అశోక్ రాజు, ఆర్టీవో శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యాదయ్య గౌడ్, సీనియర్ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల అధ్యక్షులు రాజనరసింహాలు,లైజన్ ఆఫీసర్ నరేందర్, డీఎస్పీ శ్రీధర్, ఆర్డిఓ పద్మశ్రీ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు .
____________

జారీచేసేవారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, మహబూబ్ నగర్

 

Share This Post