ఆర్టీసీ, పోలీస్, రవాణాశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో/ కెపాసిటీకి మించిన ప్యాసింజర్ లతో నడిపే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు.

* ప్రచురణార్థం *

జయశంకర్ భూపాలపల్లి నవంబర్ 16 (మంగళవారం).

ఆర్టీసీ, పోలీస్, రవాణాశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో/ కెపాసిటీకి మించిన ప్యాసింజర్ లతో నడిపే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రవాణా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రహదారి భద్రత నియమాలు పాటించక పోవడం మూలంగా జిల్లాలో తరచుగా రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ ప్రమాదాలలో ప్రజలు క్షతగాత్రులు కావడమే కాకుండా కొన్ని సంఘటనల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయని ఇలాంటి సంఘటనలు జిల్లాలో పునరావృతం కాకుండా రహదారి భద్రత నియమాలు అధికంగా ఉల్లంఘనకు గురి అయ్యే భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్, కమలాపూర్ ఎక్స్ రోడ్, కాటారం, మహాదేవపూర్, చెల్పూర్, ఘన్ పూర్ ఎక్స్ రోడ్ తదితర ప్రాంతాలతో పాటు స్థానికంగా గుర్తించిన ఇతర ప్రాంతాలపై నిఘా పెట్టి ఆర్టీసీ, పోలీస్, రవాణాశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా అధికలోడుతో ప్రయాణికులను రవాణా చేసే ప్రైవేటు వాహనాలపై ఫైన్ విధించాలని, అవుసరమైతే వాహనాలను జప్తు చేయాలనీ అన్నారు. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి అధికాలోడుతో ప్రజలను రవాణా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న 3 సీటర్, 7 సీటర్ ఆటోలు మరియు జీపులతో పాటు ఇతర వాహనాలపై చెర్యలు తీసుకోవాలన్నారు. రెగ్యులర్ గా దాడులు నిర్వహించి అక్రమ రవాణా వాహనాలను కంట్రోల్ చేయాలని అన్నారు. వివిధ సందర్భాల్లో సీజ్ చేసిన వాహనాలకు ఆక్షన్ నిర్వహించాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. కేటాయించిన రూట్లలో సమయానికి బస్సులను నడుపుతూ సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. సాధారణ రోజువారి తనిఖీలతో పాటు ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో కలిసి ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా వాహనాల రవాణా జరుగకుండా చూడాలని పోలీస్ శాఖ వారిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయభాస్కర్, డివిజనల్ మేనేజర్ శ్రీదేవి, భూపాలపల్లి డిపో మేనేజర్ ధరమ్ సింగ్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎండి సంధాని, స్పెషల్ బ్రాంచ్ పోలీస్ ఇన్స్పెక్టర్ వేణు తదితరులు పాల్గొన్నారు. డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

Share This Post