ఆర్వోఎఫ్ఆర్ చట్టంపై అధికారులు పూర్తి అవగాహన కల్గివుండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

ఆర్వోఎఫ్ఆర్ చట్టంపై అధికారులు పూర్తి అవగాహన కల్గివుండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శనివారం డిపిఆర్సీ భవన సమావేశ మందిరంలో ఎంపిడివోలు, తహశీల్దార్లు, ఎఫ్ఆర్ఓలు, ఎమ్.పి.ఓ.,
పంచాయతీ కార్యదర్శులకు ఆర్వోఎఫ్ఆర్ చట్టంపై ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ హాజరై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షెడ్యూల్ తెగల అటవీ హక్కుల గుర్తింపు బిల్లు 13 డిసెంబర్ 2005 లో లోకసభ లో ప్రవేశపెట్టి, 31 డిసెంబర్ 2007 నుండి చట్టం, 1జనవరి, 2008 నుండి నియమాలు అమలులోకి వచ్చాయన్నారు. జీవనాధారానికి తరతరాలుగా అడవిలో నివసిస్తూ, అడవిపై ఆధారపడి జీవిస్తూ, ఎలాంటి నమోదిత హక్కులు లేని అటవీ నివాస షెడ్యూల్ తెగల, ఇతర సాంప్రదాయ అటవీ నివాసితుల హక్కులను గుర్తించి నమోదు చేయడం ఈ చట్టం లక్ధ్యమని అన్నారు. ప్రధానంగా అడవి, అడవి భూములపై ఆధారపడి జీవనోపాధి కొనసాగిస్తున్న అటవీ నివాసితులైన షెడ్యూల్ తెగల వారు, ఇతర సాంప్రదాయ అటవీ నివాసితులు ఎవరైతే 13 డిసెంబర్ 2005 నాటికి ముందు కనీసం 3 తరాలు అనగా 75 సంవత్సరాలుగా నివసించే సముదాయం, సముదాయానికి చెందిన వ్యక్తి దీనికి అర్హులని ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 94 గ్రామపంచాయతీలకు చెందిన 132 ఆవాసాల నుండి 18295 దరఖాస్తులు 42409.04 ఎకరాలకు సంబంధించి వచ్చాయన్నారు. సర్వే, క్షేత్ర పరిశీలనకు 48 టీములు ఏర్పాటు చేశామన్నారు. గ్రామ పంచాయతీని ఒక యూనిట్ గా తీసుకొని, ఆవాసాల వారిగా గ్రామసభ ఏర్పాటుచేయాలన్నారు. సర్వే, క్షేత్ర పరిశీలన చేపట్టాలన్నారు. అటవీ హక్కుల నిర్ధారణకు ఆధారాలు సేకరించాలన్నారు. అటవీ హక్కుల క్లైములకు సంబంధించి వినతులపై చర్యలు చేపట్టాలన్నారు. దరఖాస్తుల విచారణ అనంతరం గ్రామసభ తీర్మానం చేసి, డివిజన్ స్థాయి కమిటీకి పంపాలన్నారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పీవో గౌతమ్ పోట్రూ, అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post