ఆర్.టి.ఐ యాక్ట్ ఫేక్ న్యూస్ పై కేసు నమోదు


జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి.కర్ణన్

00000
ఆర్.టి.ఐ. యాక్ట్ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం నుండి వివరాలు తీసుకున్నట్లు సృష్టించిన ఫేక్ న్యూస్ పై హుజురాబాద్ పోలిస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు కరీంనగర్ పోలిస్ కమీషనర్ సూచనల మేరకు హుజురాబాద్ పోలిస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. కేసు నెం.359/2021 తేది.28-10-2021 ఎఫ్.ఐ.ఆర్ కూడా నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మోహన్ మగనేటి పేరున కేంద్ర ఎన్నికల సంఘంలోని గురుప్రీత్ సింగ్ అండర్ సెక్రటరి అండ్ పి.ఐ.ఓ నుండి ఆర్టిఐ యాక్ట్ ద్వారా సమాచారం పొందినట్లు ఫేక్ లెటర్ సృష్టించి దానిని సోషన్ మీడియా వేదికగా ప్రచారం చేసిన దానిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇట్టి కేసును సైబర్ క్రైం టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నామని, ఇంతవరకు 4 గురు అనుమానిత వ్యక్తులను గుర్తించామని, దర్యాప్తును ముమ్మరం చేసి త్వరలో అసలైన నిందితులను గుర్తిస్తామని తెలిపారు.

Share This Post