ఆలుగడ్డ సాగు అదునాతన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన సదస్సు

వికారాబాద్ జిల్లా ఆలుగడ్డ సాగు కు మంచి వాతావరణం ఉందని ఇప్పటికే జిల్లాలోని రైతులు ఆలుగడ్డ సాగు చేస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నారు అని జిల్లా కలెక్టర్ శ్రీమతి నిఖిల అన్నారు.
శనివారం వికారాబాద్ డి పి ఆర్ సి భవనంలో ఆలుగడ్డ సాగు అధునాతన యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతిని వెలిగించి మాట్లాడుతూ, వికారాబాద్ జిల్లా హైదరాబాద్ నగరానికి చెరువలో ఉందని తెలిపారు. యాసంగిలో అధిక మొత్తంలో ఉద్యాన పంటల సాగు చేసి రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని కోరారు. రాష్ట్ర ఉద్యాన సంచాలకులు శ్రీ వెంకటరామి రెడ్డి మాట్లాడుతూ రైతులు శాస్త్రవేత్తలు సూచించిన అంశాలను పాటించి వాటికనుగుణంగా ఆలుగడ్డ సాగు చేయాలన్నారు. ఆలుగడ్డ ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుందని మిశ్రమ పద్ధతిలో ఈ పంటను సాగు చేసుకోవచ్చని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీ. మెతుకు ఆనంద్ మాట్లాడుతూ కూరగాయల నారు నకిలీ విత్తనాలు పట్ల రైతులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ రైతులు ఆలుగడ్డ సాగును అధికంగా వేయాలని కోరారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆలుగడ్డ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం కె పాండు డైరెక్టర్ ఐ సి ఎ ఆర్ సి పి ఆర్ ఐ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ భాగంగా వికారాబాద్ జిల్లాలో కూరగాయల సాగు చేపట్టాలని నిర్ణయించామన్నారు. డాక్టర్ సాగర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ మాట్లాడుతూ అధిక మొత్తంలో నష్టం కలగజేసే చీడపీడలను తొలగించడం ముఖ్యమని తెలిపారు. ఆలుగడ్డ పై రసం పీల్చే పురుగులు పేనుబంక, తామర పురుగులు తదితర వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. డాక్టర్ కుమార్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సంజయ్ రావు గారు మాట్లాడుతూ పంట కోత సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే బంగాళదుంపలు నాణ్యతగా పెంచుకోవచ్చని అన్నారు. డాక్టర్ వెంకట చలం సైంటిస్ట్ మాట్లాడుతూ భారతదేశంలో దీర్ఘకాలికంగా బంగాళదుంపలను సాగు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన కళాశాల పరిశోధన కేంద్రం డైరెక్టర్ శ్రీ రాజ్ కుమార్, సీనియర్ సైంటిస్ట్ లు పాల్గొని రైతులకు అర్థమయ్యే భాషలో అధునాతన పద్ధతులను తెలిపారు. ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ బాబు, వేణుగోపాల్, విజయ్ ప్రసాద్ లు, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ కృష్ణ రావు,
శ్రీ యాదగిరి, జిల్లా పట్టు పరిశ్రమ ఉద్యాన శాఖ అధికారి చక్రపాణి, పట్టు పరిశ్రమ సంచాలకులు మల్లికార్జున్, ఉద్యాన శాఖ అధికారులు, సింబంది, జిల్లా రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post