ఆసరా పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యం వహించరాదు: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

ప్రచారణార్ధం ………………1

జయశంకర్ భూపాలపల్లి జూన్ : 01

ఆసరా పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యం వహించరాదు: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

ఉపాధి హామీ రోజు వారీ కూలి పనుల డబ్బుల పంపిణీ లో అలసత్వం వహించ కూడదు : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

 

జిల్లాలోని ఆయా మండల గ్రామాల్లో పోస్ట్ ఆఫీస్ ద్వారా

ఉపాధి హామీ పథకం మరియు ఆసరా పెన్షన్లు తీసుకునేవారికి సకాలంలోనే వారికి డబ్బులు చెల్లించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సంబంధిత పోస్టల్ డిపార్ట్మెంట్ వారిని ఆదేశించారు గురువారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే వారి పూర్తి సమాచారాన్ని సేకరించి ప్రతి నెలా వారి పోస్ట్ ఆఫీసు ఖాతాలో నగతును జమ చేయాలని ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామాల్లో మంచి ప్రాధాన్యత ఉన్నందున నగతును వారి ఖాతాలో జమ అయిన వెంటనే వారికి అందచేసే విదంగా పోస్టల్ శాఖా వారు చొరవ చూపాలని అన్నారు అదేవిదంగా గ్రామాల్లో ఆసరా పింఛన్లు తీసుకునే వారికి పోస్టల్ శాఖ వారు వేలి ముద్ర ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న నగతు వియయం లో మిషన్ లలో సాంకేతిక లోపాల కారనాల వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కుంటున్న విషయాన్ని కలెక్టర్ పోస్టల్ శాఖ వారిని అడిగి తెలుసుకున్నారు అలాగే జిల్లాలో పెండింగ్ లో ఉన్నా ఆసరా పింఛన్లు, మరియు ఉపాధి హామీ పనుల పెండింగ్ నగతును వారంలో అందరికి అందేలా చూడాలని సంభదిత పోస్టల్ శాఖ వారిని కలెక్టర్ ఆదేశించారు

ఈ కార్యక్రమంలో డి అర్ డి ఓ పురుషోత్తం, పోస్టల్ శాఖ వారు తదితరులు పాల్గొన్నారు
…………………………………………..
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం జయశంకర్ భూపాలపల్లి

Share This Post