ఆసిఫాబాద్‌ను 100 శాతం వ్యాక్సినేషన్‌ జిల్లాగా నిలపాలి : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

కరోనా వైరస్‌ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ఆసిఫాబాద్‌ను 100 శాతం వ్యాక్సినేషన్‌ జిల్లాగా నిలిపేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లాలో గత 15 రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక డైవ్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన నేపథ్యంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందితో కలిసి కేక్‌ కట్‌ చేసి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ 15 రోజులుగా జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో మొదటి, రెండవ డోస్‌లు కలిపి 1 లక్షా 37 వేల 948 మందికి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ అందించడం జరిగిందని, ఇందుకు వైద్య సిబ్బంది, అంగన్‌శాడీ, ఆశా కార్యకర్తలు, గ్రామపంచాయతీ సిబ్బందితో పాటు మీడియా సభ్యులు సహకారం అందించడం అభినందనీయమని అన్నారు. జిల్లాలో 18 సం॥లు దాటిన వారు 8 లక్షల 29 వేల 251 మంది ఉండగా, ఇప్పటివరకు మొదటి డోసు 2 లక్షల 3 వేల 551 మందికి అందజేయడం జరిగిందని, రెండవ డోసు 40 వేల 397 మందికి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని 100 శాతం పూర్తి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మనోహర్‌, ఉప వైద్యాధికారి సుధాకర్‌నాయక్‌, జిల్లా పంచాయతీ అధికారి
శ్రీకాంత్‌, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post