ఆసుపత్రికి రాలేని రోగులకు వైద్య సేవలు అందించేందుకు ఆలన అంబులెన్స్‌ : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

వివిధ వ్యాధులతో బాధపడుతూ ఆసుపత్రికి రాలేని రోగులకు వారి వద్దకే వెళ్ళి వైద్య సేవలు అందించేందుకు ఆలన హోంకేర్‌ సర్వీస్‌ అంబులెన్స్‌ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి తెలిపారు. బుధవారం జిల్లాలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయ ఆవరణలో జిల్లా వైద్యాధికారి డా॥ కుమం బాలుతో కలిసి అంబులెన్స్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాలలో వైద్య సేవలు అవసరం ఉండి ఆసుపత్రికి రాలేని వారి వద్దకే వెళ్ళి సేవలు అందించడం జరుగుతుందని, వాహనంలో ఒక వైద్యుడు, ముగ్గురు నర్సులు, ఒక ఆరోగ్య కార్యకర్త ఉంటారని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో క్యాన్సర్‌, పక్షవాతం, ఇతర జబ్బులు ఉన్నవారిని 1 వేయి 886 మందిని గుర్తించడం జరిగిందని, ఆసుపత్రికి రాలేని వారిని ఆలన అంబులెన్స్‌ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా టీకాల నివారణ అధికారి డా॥ ఫయాజ్‌, జిల్లా ఉప వైద్యాధికారి డా॥। విజయ పూర్ణిమ, ప్రోగ్రామ్‌ అధికారులు డా॥ సుబ్బారాయుడు, డా॥ అనిత, మాస్‌ మీడియా అధికారి వెంటేశ్వర్లు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post