ప్రచురణార్థం
మహబూబాబాద్, డిసెంబర్,01.
ఆసుపత్రి అభివృద్ధి పనులు వేగవంతం చేసి అందుబాటులో కి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.
గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించి వైద్య , ఇంజనీరింగ్ అధికారులతో అభివృద్ధి పనులు స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…
లీకేజీ లను అరికట్టాలని, ఏ.సి.లు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వాహనాలను ఆసుపత్రిలో ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేయించరాదని బయటనే పార్కింగ్ కు ఏర్పాటు చేయాలన్నారు. 102 108 వాహనాలకు మాత్రమే ఆసుపత్రిలో పార్కింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు.
డ్రైనేజీ కాలువను మున్సిపల్ అధికారులతో మాట్లాడి కనెక్షన్ ఇప్పించడం జరుగుతుందన్నారు.
ఆసుపత్రి వెనుక భాగంలో ఉన్న చెత్త చెదారని తొలగించాలని ఆ స్థలాన్ని వాహనాల పార్కింగ్ గా వినియోగించాలన్నారు.
ప్రధాన ఆసుపత్రికి బోర్డు ఏర్పాటు చేయాలని ఎటు వైపు చూసినా కనిపించే విధంగా ఉండాలన్నారు.
హాస్పిటల్లో చెత్త చెదారం తొలగించి మట్టి కనిపించకుండా శుభ్రపరిచి టైల్స్ తో ఆవరణ మొత్తం అందంగా తీర్చిదిద్దాలన్నారు. సీసీటీవీలో ఏర్పాటు చేయాలని ప్రతిరోజు అయ్యే రికార్డింగ్‌ను భద్రపరచాలన్నారు.
భవన నిర్మాణంలో అసంపూర్తి పనులు ఉండరాదని ప్లాస్టిక్ పనులు పూర్తి చేసి పెయింటింగ్ ను ప్రారంభించాలన్నారు.
కలెక్టర్ వెంట ఆసుపత్రి పర్యవేక్షకులు వెంకట రాములు ఇంజనీరింగ్ అధికారులు టీఎస్ఐసి వరంగల్ జోనల్ మేనేజర్ సంతోష్ కుమార్ రామ టి ఎస్ ఎం ఐ డి సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమా మహేశ్వర్ ఆర్ ఎమ్ ఓ వైదేహి డాక్టర్ రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.