ఆసుపత్రులలో ప్రసవాలు జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

జిల్లాలోని గర్భిణులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు జరిగే విధంగా గ్రామ స్థాయి నుండి పూర్తి స్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డితో కలిసి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, జిల్లా సంక్షేమ శాఖ, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గర్భిణులకు ప్రసవాలు ఆసుపత్రులలో జరిగే విధంగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో తగు చర్యలు తీసుకోవాలని, గర్భిణులు వారి సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులలో వారి వివరాలు నమోదు చేసుకోవాలని, ప్రతి నెల సమయపాలన పాటిస్తూ అవసరమైన పరీక్షలు, స్మానింగ్‌ చేసుకునేలా అవగాహన కల్పించాలని, ఏ ఒక్కరు రక్తహీనతతో బాధపడకుండా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సమగ్ర పౌష్టికాహారం అందించాలని తెలిపారు. రక్తహీనత లోపాన్ని అధిగమించే విధంగా తీసుకోవలసిన ఆహారం, జాగ్రత్తలపై సంబంధిత అధికారులు సిబ్బంది గర్భిణులకు వివరించాలని, ప్రసవాలు సమస్యాత్మకంగా మారకుండా ముందస్తుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో కొవిడ్‌-19 వలన మృతి చెందిన వారి వివరాలు మీ-సేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులు పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి మనోహర్‌, ఉప వైద్యాధికారి సుధాకర్‌నాయక్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, జిల్లా సంక్షేమ వాఖ అధికారులు, సిబ్బంది, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లు, కార్యకర్తలు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post