ఆస్తి పన్నును వారం రోజుల్లోపు వసూలు చేయాలి : అధనపు కలెక్టర్ రాహుల్ శర్మ

ఆస్తి పన్నును వారం రోజుల్లోపు వసూలు చేయాలని అధనపు కలెక్టర్ రాహుల్ శర్మ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

ఈరోజు అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో మున్సిపల్ కమిషనర్లు ఇతర సిబ్బందితో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మున్సిపాలిటీలలో పేరుకుపోయిన ఆస్తి పన్నులను సిబ్బంది వస్సులు చేయడంలో నిర్లక్ష్యం వహించడం సరికాదని ఆయన అన్నారు.

అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వంద శాతం ఆస్తి పన్నులు వసూలు చేయాలని ఆయన ఆదేశించారు. మున్సిపాలిటీలలో నర్సరీలు, పట్టణ ప్రగతి వనాలను నిర్వహణలో భాగంగా ఎలాంటి అలసత్వం వహించకూడదని ఆయన సూచించారు.

ఇప్పటికే జిల్లాలో మంజూరైన వెజ్ అండ్ నాన్ వెజ్ సమీకృత మార్కెట్ సముదాయాలు అదేవిధంగా వైకుంఠధామాల పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

జిల్లాలో పట్టణ ప్రగతి కింద చేపట్టిన పనులను మున్సిపల్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వారం రోజుల్లో జిల్లాను సందర్శించి పర్యవేక్షించనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.

పరిగి మున్సిపల్ కేంద్రంలో జాతీయ రహదారిలో వీధి దీపాలు లేనందున ప్రజలు ఎంతో ఇబ్బందిగా గురవుతున్నారన్న విషయాన్ని మున్సిపల్ కమిషనర్ అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా..

దీనిపై స్పందించి సాయంత్రం లోగా వీధి దీపాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని జాతీయ రహదారుల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో వికారాబాద్, పరిగి, కొడంగల్ మున్సిపల్ కమిషనర్లు శరత్ చంద్ర, జి‌. శ్రీనివాసన్, టి.ప్రవీణ్ కుమార్, ఏఈ,డిఇ లతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Share This Post