ప్రచురణార్థం
ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మినహాయింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి….స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్
మహబూబాబాద్, జూలై -21:
ఆస్తిపన్ను బకాయిదారులు 90 శాతం వడ్డీ మినహాయింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బకాయిలను చెల్లించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ నేడోక ప్రకటనలో తెలిపారు.
2021-22 వరకు బకాయిలు ఉన్న గృహ యజమానులు వన్ టైం సెటిల్ మెంట్ క్రింద 90 శాతం వడ్డీ మినహాయింపు తో 2022 అక్టోబర్ 31లోగా బకాయిలు చెల్లించి వడ్డీ మినహాయింపు పొందాలని, ఇట్టి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.
