ఆహారభద్రత చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలి :రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి

ప్రచురణార్థం
ములుగు జిల్లా
డిసెంబర్, ( శుక్ర వారం).

*ఆహారభద్రత చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలి

ఆహార భద్రత చట్టం 2013 పై ప్రజలకు అవగాహన కల్పించాలి
విజిలెన్స్ కమిటీలు నెల వ్యవధిలో ఏర్పాటు చేయాలి రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి
జిల్లాలో ఆహార భద్రత చట్టం అమలు పై అవగాహణ కల్పించుటకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు కేటాయించాలి -జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
గత మూడు రోజులుగా జిల్లా లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ పర్యటించి అంగన్వాడి సెంటర్స్,ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు , రేషన్ షాపులలో తనిఖీలు నిర్వహించి కొన్ని అంశాలు తెలుసుకోవడం జరిగిందని , అందులో బాగంగా శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ఆహార భద్రత చట్టం 2013 అమలు పై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రానికి రాష్ట్ర పుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య , డిఆర్వో రమాదేవి ,డిఅర్దివో నాగ పద్మ జా, జిల్లా పౌర సరఫరాల అధికారి అరవింద్ రెడ్డి మరియు జిల్లా అధికారులు ,ప్రజా ప్రతినిధుల తో ఈ సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా పుడ్ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ ఆహార భద్రత చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. జిల్లా మరియు మండల, గ్రామాల వారిగా జరిగే సమావేశాల్లో ఆహార భద్రతా చట్టం అవగాహణను ఎజెండా అంశంగా పెట్టి ప్రజలకు చట్టం గురించి తెలియజేయాలని అన్నారు.
జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీని నెల రోజుల వ్యవధిలోనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పేదవాడికి నష్టం జరిగినట్లయితే సమాజం నష్టపోతుందని, ఇట్టి విషయం పై జిల్లా యంత్రాంగం సమన్వయ తో మానవతా దృక్పదం కలిగి ఉండాలని, అలాంటప్పుడే 100 % పౌష్ఠిక ఆహారం అందిన జిల్లాగా ములుగు ఉండగలుగుతుందని కమిషన్ అన్నారు.
ములుగు జిల్లా అట్టడుగు గిరిజన మారుమూల ప్రాంతం అని ఇక్కడి ప్రజలకు, పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలని, ఆహార వస్తువులు సరసమైన ధరల తో ఉన్నట్లయితే గౌరవప్రదంగా ఉంటుందని వారు అన్నారు.ప్రభుత్వం నుంచి అమలయ్యే అనేక పథకాలు ప్రజలకు చేరువ అయ్యే దిశగా జిల్లా యంత్రాంగం పనిచేయాలని సూచించారు .
ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విషయంపై దృష్టి సారించి ఉన్నట్లయితే ఏదైనా సమస్యలు ఉంటె వాటిని పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్లవలసిన బాధ్యత మీపై ఉందని గుర్తు చేశారు.
జిల్లాలో గత మూడు రోజులుగా పర్యటించి రేషన్ షాప్ అంగన్వాడి సెంటర్స్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను సందర్శించి అనేక విషయాలను పరిశీలించడం జరిగిందని, ఈ పరిశీలనలో ప్రజలుకు కొంత అవగాహన అవసరం ఉందని, ప్రభుత్వ పరంగా కొంత నిధులు కూడా ఏర్పాటు చేయవలసిఉన్నదని, ఇటి విషయం పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్దామని పుడ్ కమిషన్ చైర్మన్ అన్నారు. పౌష్ఠిక ఆహారం పర్యవేక్షణలో బాగంగా వరంగల్లు నుండి నర్సింగ్,మెడికల్ స్టూడెంట్ తో నెలకోక్కసారి విజిట్ చేసేలా చూడాలని అన్నారు. దానికి షోషల్ ఆడిట్ కూడా తప్పని సరి అన్నారు. కమిషన్ ఎప్పుడైనా విధినిర్వహణ లో ఏవిదమైన లోపం ఉన్నట్లుఐతే వ్యక్తిగతంగా బాధ్యులను చేస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగునని వారు అన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు ఆనంద్ మాట్లాడుతూ జిల్లాలో మారు మూల ప్రాంత ప్రజలకు పౌష్టిక ఆహారం లేనట్లు ఐతే ఎత్తుకు తగిన భారువును కోల్పోతుంటారు . రక్త హీనత సమస్యతో ప్రజలు బాధపడుతుంటారు . అలా జరగకుండా ఉండాలంటే ఆహార భద్రత చట్టం 2013 అమలు కచ్చితంగా అమలు చేయాలనీ వారు అన్నారు. ఇందులో బాగమే కెసిఆర్ కిట్ అందించడం జరుగుతుందని వారు అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ తీవ్రత అధికంగా ఉన్నసమయం లో జిల్లా ప్రజలకు రేషన్ సరఫరా చేయుటకు జి పి ట్రాక్టర్స్ ను ఉపయోగించి మారుమూల ప్రాంతాలకు నిత్యావసర సరుకులు సరఫరా చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామన్నారు.
జిల్లాలో హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలకి మెనూ ప్రకారం పౌష్ఠిక ఆహారం అదందించడం జరుగుతుందని అన్నారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వారి ద్వారా 6 మండలాలకు జిల్లా పరిషత్ హైస్కూల్ పిల్లలకి బాదం మిల్క్ అందించడం జరుగుతుందని అన్నారు. గర్భిని స్త్రీలకు అంగన్వాడి సెంటర్స్ ద్వారా పౌష్టిక ఆహార సరకులు సరఫరా చేస్తున్నామని అన్నారు. ములుగు జిల్లా గ్రామీణ ప్రాంతంగా ఉన్నందున ఈ జిల్లా పై ప్రత్యెక చొరవ చూపి అంగన్ వాడికి, స్కూల్స్ కి నిధులు సంకుర్చేలా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమలో జిల్లా విద్య శాఖా అధికారి పాణిని ,జిల్లా వైద్య శాఖ అధికారి డా.అప్పయ్య , ట్రైబల్ వెల్ఫేర్ డి డి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రేమలత ,జిల్లా లోని తహసిల్దర్స్ ,యంపిడివోలు,రేషన్ డీలర్స్, సంబందిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share This Post