ఆహారా భద్రత చట్టం సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఫుడ్ కమిషన్ చైర్మన్ కె.తిరుమల్ రెడ్డి పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, జిల్లా ప్రజాపరిషత్ చైర్మెన్ కనుమల్ల విజయ, ఫుడ్ కమిషన్ సభ్యులు, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, శ్యాం ప్రసాద్ లాల్, ZP CEO ప్రియాంక. (కరీంనగర్ జిల్లా).

ఆహార భద్రత చట్టం పగడ్బందీగా అమలు చేయాలి

ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా సంక్షేమ పథకాలను అమలు చేయాలి

రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ కె. తిరుమల్ రెడ్డి

ఆహార భద్రత చట్టం అమలు తీరుపై సమీక్షా సమావేశం
000000
ఆహార భద్రత చట్టం పగడ్బందీగా అమలు చేయాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ కె. తిరుమల్ రెడ్డి అన్నారు.

బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆహార భద్రత చట్టం 2013 అమలు తీరుపై కమిషన్ సభ్యులు, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తో కలసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవించే హక్కు ప్రజలందరికీ ఉందని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, అవి వారికి అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. పేదలకు రేషన్ సరుకులు, విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం,  అంగన్వాడీల ద్వారా  చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు కోడిగుడ్లు, పోషకాహారం, బాలామృతం, కెసిఆర్ కిట్లు లాంటి పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తుందని తెలిపారు. ఇవి లబ్ధిదారులకు సక్రమంగా చేరేలా  చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. లబ్ధిదారులకు గల చట్టబద్ధమైన హక్కులను అమలు చేయాలని తెలిపారు. అర్హులైన కొత్త వారికి రేషన్ కార్డులు అందించాలని, రేషన్ కార్డులు అవసరం లేని వారు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని ఆహార కమిషన్ చైర్మన్ కోరారు. 65 సంవత్సరాలు పై బడిన వృద్ధులకు రేషన్ షాప్ లలో వేలిముద్రలు, ఐరిష్ రావడంలేదని రేషన్ ఇవ్వడం ఆప వద్దని సూచించారు. లబ్ధిదారులు అందరికీ రేషన్ అందించే బాధ్యత అధికారులు తీసుకోవాలని, తహసిల్దార్ లు రేషన్ షాపులను పర్యవేక్షించాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, ఒంటరి మహిళలకు, అనాధలకు బియ్యము, పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. చౌక ధరల దుకాణాల లో వృద్ధులకు వేలిముద్రలు, ఐరిష్  రానీ పక్షంలో పంచాయతీ కార్యదర్షుల ద్వారా లబ్ధిదారులను గుర్తించి రేషన్ సరుకులు అందించేలా చర్యలు తీసుకోవాలని తహసిల్దార్లు,  ప్రజాప్రతినిధులకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో బరువు తక్కువ ఉన్న పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు కోడిగుడ్లు, పోషకాహారం ఖచ్చితంగా అందించాలని, స్టాక్ రిజిస్టర్లు సరి చూసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారికి సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ  ద్వారా గర్భిణులకు కెసిఆర్ కిట్ లు అందిస్తున్నామని తెలిపారు. వ్యాక్సినేషన్ మొదటి డోసును 100 శాతం పూర్తిచేసి రాష్ట్రంలో జిల్లా ను మొదటి స్థానంలో నిలిపామని అన్నారు. వ్యాక్సినేషన్ రెండవ డోసు 90 శాతం పూర్తి చేశామని కలెక్టర్  తెలిపారు. జిల్లాలో ఆహార భద్రత చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తున్నామని తెలిపారు.

అంతకుముందు ఆహార కమిషన్ సభ్యుడు ఓరుగంటి ఆనంద్ ఆహార భద్రత చట్టం గురించి, అమలు చేయాల్సిన విధానం గురించి విపులంగా వివరించారు.

 

Share This Post