ఆహార భద్రతా చట్టాన్ని గ్రామ స్థాయి నుండి జిల్లాస్థాయి వరకు పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఆహార భద్రత కమిటి చైర్మన్ తిరుమల రెడ్డి తెలిపారు.

శనివారం కలెక్టరేట్ సమావేశపు హాలులో యంపిటిసిలు, సర్పంచ్లు, ఎంపిపిలు, జడ్పీటిసిలు, పౌర సరఫరాలు, పౌర సరఫరాల సంస్థ, డిఆర్డిఓ, డిఈఓ, ఐసిడిఎస్, వైద్య, మున్సిపల్/ కమిషనర్లు, ఫుడ్ ఇన్స్పెక్టర్, యంపిడిఓలతో ఆహార భద్రత చట్టంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ఆహార భద్రతా ఛైర్మన్ తిరుమలరెడ్డి, సభ్యులు భారతి, శారద, ఆహార భద్రతా కో కన్వీనర్ మరియు జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో ఆహార భద్రతా చర్యల అమలు తీరును పరిశీలన చేసేందుకు రెండు రోజుల పాటు పర్యటించినట్లు చెప్పారు. కరువుకాటకాలు, ఆహార కొరత, పౌష్టిక లోపం వల్ల మానవాళి ఉనికి కోల్పోయే పరిస్థితుల్లో మానవ సంపదను కాపాడుకునేందుకు కమిటి ఏర్పాటు జరిగినట్లు ఆయన తెలిపారు. ఆహార భద్రత బాధ్యత కల్పించేందుకు చట్టం చేయడం జరిగిందని ఆయన వివరించారు. చౌకదుకాణాల ద్వారా పంపిణీ చేయబడుతున్న నిత్యావసర వస్తువులు, పాఠశాలల్లో విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేయబడుతున్న నిత్యావసర వస్తువులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేసుకున్న మహిళలకు కెసిఆర్ కిట్లు పంపిణీ, సంక్షేమ హాస్టళ్లులో విద్యార్థులకు అందచేస్తున్న ఆహార మెనూ తదితర అంశాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నామని, గుర్తించిన లోటుపాట్లును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించు విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రజలకు నాణ్యమైన, పోషకాలతో కూడి ఆహారం సక్రమందా అందుతున్నాయో లేదో కమిటి అన్ని జిల్లాలలో పర్యటించి తెలసుకుంటున్నామని చెప్పారు. గ్రామ, మండల, జిల్లాస్థాయిలో ఆహార బద్రతా కమిటీలు ఏర్పాటు చేయడం వల్ల సమస్యలు సత్వరం పరిష్కారం కావడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం యంత్రాంగంతో గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆహార బద్రతా సమస్యలను ప్రజలు డిఆర్డిఓకు కానీ కమిషన్ దృష్టికు తీసుకురావాలని ఆయన తెలిపారు. సమాజిక తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకంలో ఎక్కడైనా శాంపిల్స్ సేకరణ చేశారా లేదా మీరు ల్యాబ్ కాదుకదా అంటూ డిఈఓ, ఫుడ్ ఇన్స్పెక్టర్ శాంపిల్స్ సేకరణ చేయాలని ఆదేశించారు. ప్రజల హక్కులకు బంగం వాటిల్లితే బాద్యులతపై కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. ఆహార భద్రత, ఆరోగ్య విషయాలలో ప్రభుత్వం మంచి స్థాయిలో ఉందని చెప్పారు. జిల్లాలో 68 శాతం మంది మహిళలు రక్తహీనతతో భాదపడుతున్నారని, వీరందరికీ బలవర్ధకమైన ఆహారాన్ని అందించు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజలు హక్కులు, బాధ్యతలు తెలసుకోవడానికి వీలుగా అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల్లో హక్కుల వివరాలను తెలియచేయు పట్టికతో పాటు హక్కులకు బంగం వాటిల్లినప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలో వారి వివరాలను ప్రదర్శింపచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చట్టంపై ప్రజలకు అవగాహన చాలా ముఖ్యమని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పనపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. సమస్యలను ప్రజా ప్రతినిధులు కమిషన్ దృష్టికి తెచ్చే వరకు వేచి చూడకుండా తక్షణమే పరిష్కరించు విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యలు పరిష్కారంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులపై కమిషన్ చాలా సీరియస్ గా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రాముఖ్యత, ప్రాధాన్యతను బట్టి మౌలిక సదుపాయాలు కల్పించు విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ సిబ్బంది వేతనాలు తీసుకోవడంతో పాటు మానవత్వంతో ప్రజలకు సేవలందించాలని చెప్పారు. ఆహార భద్రతా చట్టం హక్కులు, విధులు, సలహాలు, సూచనలు గురించి గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు నిర్వహించే సమావేశాల్లో చర్చించాలని ఆయన సూచించారు.

నాణ్యతా ప్రమాణాలు పాటించు విషయంలో మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార పదార్థాలు శాంపిల్స్ సేకరణ చేయాలని చెప్పారు. ప్రజలకు అన్ని సమయాల్లో ఆహారాన్ని అందించాలన్నదే. ఆహార బద్రత విషయంలో తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు కమిటి కో ఛైర్మన్ జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య మాట్లాడుతూ కమిటి మారుమూల ప్రాంతాల్లో పర్యటించి. ప్రజల సమస్యలను తెలుసుకోవడం అభినందనీయమని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు. సమస్య పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలు, మద్యాహ్న భోజనాలను సన్నబియ్యంతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఒక్కొక్క సమస్యను అధిగమిస్తూ ముందుకు పోతున్నామని చెప్పారు. కెసిఆర్ కిట్టు పంపిణీతో పిల్లలకు 16 రకాల వస్తువులను అందిస్తున్నామని, నిరుపేద కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మారు మూల జిల్లా అయిన మన ప్రాంతంలో ఇంత వరకు ఆహార బద్రత కమిటి పర్యటించిన దాఖలాలు లేవని, ప్రజలు వాస్తవంగా ఎదుర్కొంటున్న సమస్యలను కమిషన్ దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. పలువురు ప్రజా ప్రతినిధులు అంగన్వాడీ కేంద్రాలతో పాటు ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణిలు, బాలింతలు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు ఏర్పాటు చేపించాలని చెప్పారు. మధ్యాహ్న భోజనం వండుతున్న సిబ్బందికి చెల్లిస్తున్న రేట్లను పెంచి చెల్లింపు చేయు విధంగా చర్యలు తీసుకోవాలని కమిషన్ కోరారు. ఈ సమీక్షా సమావేశంలో కమిటి సభ్యులు భారతి, శారద, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పీ సిఈఓ విద్యాలత, డిఆర్డీఓ మధుసూదన్ రాజు, డిఎస్ఓ చంద్రప్రకాశ్, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ప్రసాద్, వైద్యాధికారి డాక్టర్ శిరీష, ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూర్య, జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రమాదేవి, ఫుడ్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, యంపిటిసిలు, సర్పంచులు, జడ్పీటిసిలు, యంపిపిలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post