ఆహార భద్రత చట్టాన్ని పకడ్భందిగా అమలు చేయాలి:: రాష్ట్ర ఆహర కమిషన్ చైర్మన్ కె.తిరుమల రెడ్డి

 ఆహార భద్రత చట్టాన్ని పకడ్భందిగా అమలు చేయాలి::  రాష్ట్ర ఆహర కమిషన్ చైర్మన్  కె.తిరుమల  రెడ్డి

ప్రచురణార్థం-1                                                                                                                                                                                                                                                        తేదీ.03.9.2021

ఆహార భద్రత చట్టాన్ని పకడ్భందిగా అమలు చేయాలి::  రాష్ట్ర ఆహర కమిషన్ చైర్మన్  కె.తిరుమల  రెడ్డి

జగిత్యాల,సెప్టెంబర్ 03:-      జిల్లాలో  ఆహార భద్రత చట్టాన్ని పకడ్భందిగా అమలు చేయాలని    రాష్ట్ర ఆహర కమిషన్  చైర్మన్   కె.తిరుమల్  రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.   గురువారం జిల్లాలో  తెలంగాణ రాష్ట్ర ఆహర కమిషన్  చైర్మన్ మరియు సభ్యులు  క్షేత్రస్థాయిలో  పర్యటించి జిల్లాలో ఆహార భద్రత  అమలు తీరును పరిశీలించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ఆహర కమిషన్  చైర్మన్   సంబంధిత అధికారులతో   సమావేశం నిర్వహించారు.   జిల్లాలో గురువారం   పర్యటించిన   ఆహర కమిషన్  రేషన్  షాపులు,  అంగన్ వాడి కేంద్రాలు, ప్రాథమిక ఆరొగ్య కేంద్రాలు,  పాఠశాలలను  పరిశీలించారు. పేద ప్రజలకు ఆహరం అందించడం  కోసం మరియు ఆకలి చావులు ఉండకూడదని ప్రభుత్వం అనేక వేల కోట్ల ఖర్చు  పెడుతుందని, దానిని పూర్తి స్థాయిలో సద్వినియోగం  అయ్యే విధంగా క్షేత్రస్థాయిలో అధికారులు పకడ్భందిగా  పనిచేయాలని  చైర్మన్ ఆదేశించారు.  దేశంలో 2013 సంవత్సరంలో ఆహార భద్రత చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, 2017 నుండి మన రాష్ట్రము లో ఈ చట్టాన్ని అమలు పరచడం జరుగుతున్నదని తెలిపారు. గ్రామీణ ప్రాంతం లోని 75 శాతం, పట్టణాల్లోని 50 శాతం బడుగు బలహీన వర్గాల ప్రజలకు నాణ్యమైన, సరసమైన ధరలకు సరుకులు అందించాలని చట్టంలో ఉందని, ఆ చట్టాన్ని అమలు పరచడం అధికారుల బాధ్యత అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ప్రతి ఒక్కరికి ఆరు కిలోల బియ్యం చొప్పున, ఒక రూపాయికే కిలో బియ్యం లబ్ది దారులకు అందజేయడం జరుగుతున్నదని తెలిపారు. ఆరోగ్యవంతమైన జన సంపదకు అంగన్వాడీల ద్వారా గర్భవతులకు, బాలింతలకు పౌష్ఠిక ఆహారం అందజేయడం జరుగుచున్నదని, అలాగే మూడు, ఆరు సంవత్సరాల పిల్లలకు కూడా పౌష్టికాహారం అందజేయడం జరుగుతున్నదని అన్నారు. మధ్యాహ్న భోజన కార్యక్రమం ద్వారా 14 సంవత్సరాల పిల్లలకు భోజనం అందించడం జరుగుతున్నదని తెలిపారు. బాలింతలకు మెటర్నిటీ బెన్ఫిట్ రూపేణా ఆహరం, ఇతరత్రా అవసరాలు తీర్చడానికి నగదు రూపేణా చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఈ అంశాలన్నింటినీ చట్ట బద్ధత కల్పిస్తూ, హక్కు రూపేణా పొందడం జరుగుచున్నదని అన్నారు. ఈ కార్యక్రమాల అమలును జగిత్యాల జిల్లాలో అమలు తీరును పరిశీలించేందుకు కమిషన్ పర్యటించిందని తెలిపారు.  ప్రజలకు అందించే ఆహర నాణ్యత విషయంలో   రాజీపడటానికి వీలు లేదని, నాణ్యమైన ఆహరం  అందించాలని ఆయన స్పష్టం చేసారు.  అంగన్ వాడి కేంద్రాలు,  మధ్యాహ్నభోజన పథకం అమలు తీరు,  రేషన్ షాపులొ అందుతున్న   సరకులు తదితర వాటి పై జిల్లా ఉన్నతస్థాయి అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని  ఆయన సూచించారు.  విజిలెన్స్  సరిగ్గా ఉంటేనే  ప్రభుత్వ లక్ష్యం పూర్తిగా నెరవెరుతుందని అన్నారు.  అంగన్ వాడిలు, మధ్యాహ్న భోజన పథకం  అందించే పాఠశాలలో  నిరరంతరం తనిఖీ చేసి  ఆహార నాణ్యతను  పరిశిలించాలని ఆయన ఆదేశించారు.  జిల్లాలో ఉన్న కనీసం 10 శాతం  రేషన్   షాపులను  ర్యాండం గా  గుర్తించి  వాటిలో ప్రజలకు అందించే  సరకుల నాణ్యతను  పరిశీలించాలని ఆయన అధికారులకు సూచించారు.  ప్రస్తుతం మన భారతదేశంలొ 58 శాతం మంది మహిళలు అనేమియాతో  బాధపడుతున్నారని,  అదే విధంగా పుట్టిన శిశువులలో  చాలా మంది బలహినంగా ఉంటున్నారని  తెలిపారు. పౌష్టికాహారం  ప్రజలకు అందించడం  కోసం తీసుకుంటున్న చర్యలు క్షేత్రస్థాయిలో  పకడ్బందిగా అమలు చేయాలని  తెలిపారు.   గర్భవతి స్త్రీలకు,  బాలింతలకు  పసి పిల్లలకు  మంచి పౌష్టికాహరం అందించే దిశగా అంగన్ వాడి కేంద్రాలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయని, కరోనా సమయంలో సైతం వారు మంచి పనితీరు చుపించారని ఆయన అభినందించారు.   ఆహార భద్రత చట్టం అమలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే  కఠిన చర్యలను కమిషన్ తీసుకోవడానికి ఏమాత్రం ఉపేక్షించదని ఆయన స్పష్టం చేసారు. జిల్లాలో 587 చౌకధరల దుకాణాల ద్వారా  310615   కుటుంబాలకు   రేషన్    ఈపాస్  యంత్రాల ద్వారా   ప్రతి మాసం 13808.255  మెట్రిక్ టన్నుల బియ్యం, 13220 కిలోల చక్కెర, 12000 లీటర్ల  కిరోసిన్ ఆయిల్  పంపిణీ చేస్తున్నామని అధికారులు  తెలిపారు. రేషన్ పంపిణి కి సంబంధించిన వివరాలు, అంత్యోదయ అన్నయోజన కార్డు ల ద్వారా పంపిణి చేస్తున్న బియ్యం, కార్డుల సంఖ్య వంటి వివరాలను తెలియపరుస్తూ, బోర్డులను ఏర్పాటు చేయాలనీ  చైర్మన్  అన్నారు. లబ్ధిదారులు ఏ సమస్యపైనా అయినను ఫిర్యాదు చేయదలచిన వారి వివరాలను సెల్ నంబర్ లు వంటి బోర్డులను కూడా ఏర్పాటు చేయాలనీ అన్నారు. ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ప్రజాపంపిణీ జరుగుతున్న సమయంలో పరిశీలన చేయాలనీ  చైర్మన్ అన్నారు. మార్చి 17,2020  నుండి ఇప్పటి వరకు మధ్యాహ్నం భోజనం విద్యార్థులకు అందే మానిటరి బెనిఫిట్ పై మండలాల వారిగా నివేదిక సిద్దం చేయాలని సూచించారు. ప్రభుత్వం తో చర్చించి విద్యార్థులకు మానిటరి బెనిఫిట్ అందే దిశగా కమిషన్ ప్రయత్నిస్తుందని తెలిపారు.అనంతరం అంగన్వాడీ హెల్ప్ లైన్ పోస్టర్లును ఆవిష్కరించారు.

జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత మాట్లాడుతూ ఆహార భద్రత చట్టం అతి ముఖ్యమైనది, కీలకమైనది కావున  ఈ చట్టం  పై ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు మరింత ఎక్కువగా అవగాహన కల్పించాలని,ఇది మనందరి బాధ్యతఅని సూచించారు. గ్రామాల్లో  నిర్వహించే విజిలెన్స్ సమావేశం పై స్థానిక సర్పంచ్ లకు సమాచారం అందించాలని, బియ్యం అక్రమ రవాణా జరుగకుండా మరింత పటిష్ఠమైన నిఘా పెంచాలని అధికారులకు తెలియచేశారు. అంగన్వాడీ కేంద్రంలో పనిచేసే సిబ్బంది రిటైర్మెంట్ వయస్సును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాని మనవిచేశారు.

జిల్లా కలెక్టర్ జి.రవి మాట్లాడుతూ   ఆహార భద్రత చట్టం అమలు  పై కమిషన్ అందించిన సూచనలు తప్పకుండా పాటించాలని అధికారులను ఆదేశించారు.   కరోనా సమయంలో  రేషన్ కార్డు లబ్దిదారులతో పాటు  వలస కార్మికులు,  ప్రైవేటు ఉపాధ్యాయులకు  సైతం  రేషన్ అందించామని అన్నారు.  జనవరి 2020 వరకు మధ్యాహ్నం భోజనం పథకం బిల్లు చెల్లించామని తెలిపారు. ఆహార కమిషన్ చైర్మన్ సూచనల మేరకు నివేదిక తయారు చేస్తామని తెలిపారు.

ఆహార కమిషన్ సభ్యులు  వోరిగంటి ఆనంద్, ఎం. భారతి, జగిత్యాల మరియు కొరుట్ల ఆర్.డి.ఓ.లు,   జిల్లా అధికారులు , తహసిల్దార్లు,  సిడిపిఒలు,  రేషన్ డీలర్లు,    సంబంధిత అధికారులు తదితరులు  ఈ సమావేశంలో  పాల్గోన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది

ఆహార భద్రత చట్టాన్ని పకడ్భందిగా అమలు చేయాలి::  రాష్ట్ర ఆహర కమిషన్ చైర్మన్  కె.తిరుమల  రెడ్డి

 ఆహార భద్రత చట్టాన్ని పకడ్భందిగా అమలు చేయాలి::  రాష్ట్ర ఆహర కమిషన్ చైర్మన్  కె.తిరుమల  రెడ్డి

Share This Post