ఆహ్లాదానికి చిరునామాగా నిలు స్తోంది పాల్వంచ మున్సిపల్ కార్యా లయం.

పరిశుభ్రత, పచ్చదనంతో పాటు వాల్ పెయింటింగ్స్ లతో శోభిల్లుతోంది. రెండవ విడత హరితహారంలో భాగంగా  కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యాలయ ముందు భాగంలో గ్రీనరీ కోసం క్రోటాన్ మొక్కలతో పాటు నీడను ఇచ్చే  మొక్కలు నాటారు. కార్యాలయంలోకి అడుగుపెట్టగానే పచ్చని వాతావరణం దర్శనమిస్తోంది. హరిత మొక్కల ఆహ్వానం పలికిన అనుభూతి కలుగుతోంది. దీనికి తోడుగా కార్యాలయంలోకి వెళ్లగానే గోడలకు ఇరువైపులా అందమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టి పడే విదంగా  అందమైన,  ఆకర్షణీయమైన వాల్ పెయింటింగ్స్ ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా అందమైన బొమ్మల పెయింటింగ్స్ చూపరులను ఇట్టే కట్టిపడేస్తున్నాయి. ఇటీవలికాలంలో కాలంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ పాల్వంచ మున్సిపల్ కార్యాలయపు సందర్శనలో పెయింటింగ్స్ బావున్నాయని ముచ్చటపడి ఫోటోలు దిగారు. కార్యాలయం ఆహ్లాదకరంగా ఉందని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ ను, సిబ్బందిని అభినందించారు.

 

Share This Post