*ఆహ్లాద కరమైన వాతావరణంలో క్రీడా స్పూర్తితో ఆటలు ఆడాలి:: పోలీస్ కమిషనర్ :: డా. తరుణ్ జోషి

*ఆహ్లాద కరమైన వాతావరణంలో క్రీడా స్పూర్తితో ఆటలు ఆడాలి:: పోలీస్ కమిషనర్ :: డా. తరుణ్ జోషి

*ప్రచురణార్థం-2*
జనగామ, డిసెంబర్ : 07 : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వెస్ట్ జోన్ పోలీసుల అధ్వర్యంలో ఎర్పాటు చేసిన కాకతీయ రాష్ట్రస్థాయి కబడ్డీ ఛాంపియన్‌షిప్-2021 క్రీడలను మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి, జనగాం జిల్లా కలెక్టర్ శివలింగయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా నేటి నుండి మూడురోజుల పాటు జనగాం జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట వద్ద ఫ్లడ్ లైట్ల వెలుగులో ఈ కబడ్డీ క్రీడలను నిర్వహిస్తున్నామని రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలకు చెందిన పది పురుషల జట్లతో పాటు, ఐదు మహిళల జట్లు ఈ పోటీల్లో పోటీ పడుతున్నారు. జాతీయ స్థాయి కబడ్డీ క్రీడా పోటీలలో పాల్గోన్న150మందికి పైగా జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గోంటున్నారని ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లకు భారీ మొత్తంలో నగదు పురస్కారాలతో పాటు జ్ఞాపికలను అందజేయబడుతుందని ఆయన అన్నారు. ఉమ్మడి వరంగల్ నగరంలో రామప్ప, భద్రకాళీ దేవాలయం, వేయి స్థంబాల గుడి వంటి చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయన్నారు. క్రీడాకారులు ఆహ్లాద కరమైన వాతావరణంలో క్రీడా స్పూర్తితో ఆటలు ఆడాలని, జనగామ జిల్లా ఆతిద్యాన్ని స్వీకరించి క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని అదేవిధంగా గెలుపోటములను సహజంగా తీసుకొని సమిష్టిగా క్రీడలలో పాల్గొనాలని అయన అన్నారు.
ఈ సమావేశంలో మరో అతిధి జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య మాట్లాడుతూ జనగామ జిల్లా జైన మతస్తులు ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడి ప్రజలు శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా ఉంటారని తాను ఈ జిల్లా కు రావడం సంతోషంగా ఉందన్నారు. పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి క్రీడా స్పూర్తితో ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ఇక్కడ క్రీడలు నిర్వహించడం సంతోషదాయక మన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్ర చాలా గొప్పవని అందరు కలిసి ఉండే విధంగా పండుగలు, క్రీడలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ధూంధాం, సాంస్కృతిక పోరాటాల ద్వారా తెలంగాణ రావాడానికి ఒక భాగమైనదని అన్నారు. కావున యువత మంచి మార్గంలో నడిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఈ విధంగా పోలీస్ కమిషనర్ గారు యువతను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. క్రీడలు మన జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిస్తాయని, యువత సంన్మార్గ౦లో నడవాలన్నారు. కరోనా మహమ్మారి వల్ల కబడ్డి పోటీలు నిర్వహించాలేకపోయామని, ఎవరిని కలవకుండా చేసిందని, కుటుంబాలు, బందువులు, కార్యాలయాలు, పాఠశాలలు సాముహిక కార్యక్రమాలు లేకుండా ఒక సంవత్సరం గడిపామన్నారు. ఎలాంటి అజాగ్రత్తలు పాటించకూడదన్నారు. జిల్లాలో దాదాపు 99 శాతం వాక్సినేషన్ పూర్తి చేసుకున్నప్పటికీ ప్రజలందరూ బౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు, కరోనా నిబంధనలు పాటించాలని అన్నారు. ఈ క్రీడలు జరగడం జనగామ జిల్లా క్రీడాకారుల అదృష్టమని అన్నారు. బయట పోటీ ప్రపంచం ఎలా ఉందొ తెలుస్తుందని తద్వారా అంతర్జాతీయ, జాతీయ,రాష్ట్ర స్థాయిలో నెగ్గగలుగుతామన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల క్రీడాకారుల నైపుణ్యాన్ని పరిశీలించి జనగామ జిల్లా యువత క్రీడా స్పూర్తితో ముందుకు సాగాలన్నారు. క్రీడలంటే అందరు కలిసి సమిష్టిగా ఆడడం, పోటీ తత్వం, గెలిచినా, ఓడినా ఒకే విధంగా తీసుకుంటే జీవితంలో తిరుగుండదన్నారు. యువత జీవితంలో ఎలా ఉండాలి అనేది క్రీడలు నేర్పిస్తాయని అన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రీడాకారులు పోటీలలో పాల్గొని గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యుటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బి. శ్రీనివాస్ రెడ్డి, ఈస్ట్ జోన్ డిసిపి వెంకటలక్ష్మి, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి జగదీశ్ యాదవ్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ గట్టయ్య, సారంగపాణి, ఎసిపిలు జి. కృష్ణ, రమేష్ రఘుచందర్, డా. సుగుణాకర్ రాజు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post