ఆ మహనీయుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ పాలన : మంత్రి హరీశ్‌రావు


రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ డా.బీఆర్‌ అంబేద్కర్‌, బాబు జగ్జివన్ రామ్ కలలను నిజం చేస్తున్నారని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో భాగంగా సిద్దిపేట పట్టణంలోని బీజేఆర్‌ కూడలిలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జగ్జీవన్ రామ్ ఎన్నో పదవులు సుదీర్ఘ కాలం అనుభవించినా చాలా నిరాడంబర జీవితం గడిపారన్నారు.

అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. గాంధీజీ ఎన్నో సందర్భాలలో జగ్జివన్ రామ్‌ను కొనియాడారనిగుర్తు చేశారు. ఆ మహనీయుల ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ తెలంగాణలో పాలన కొనసాగిస్తున్నారి పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పది లక్షల రూపాయల నగదు బదిలీ చేసే దళిత బంధు పథకం తెలంగాణలోనే ఉందన్నారు. ఇప్పటి వరకు విద్య, ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్ ఉంటే నేడు సీఎం కేసీఆర్‌ అన్ని రంగాల్లో రిజర్వేషన్ తెచ్చారన్నారు.

Share This Post