ఇంటర్మీడియట్ , పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ నిఖిల

జిల్లాలో ఇంటర్మీడియట్ , పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులకు సూచించారు.

గురువారం   ఇంటర్మీడియట్ , పదవ తరగతి పరీక్షల సందర్బంగా చేపట్టవలసిన వివిధ అంశాలపై రాష్ట్ర విద్యా శాఖామాత్యులు పి.సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా , కమీషనర్ దేవసేన, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్  లతో కలిసి హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం   జిల్లా కలెక్టర్  సంబంధిత అధికారులతో సమీక్షిస్తూ.. పరీక్షల సందర్బంగా విద్యార్థుల  భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.  పరీక్ష కేంద్రానికి సమయంలోపు రావాలని, నిమిషం ఆలస్యమైన పరీక్షా రాయడానికి అనుమతించరు అనే విషయాన్ని విద్యార్థులకు స్పష్టంగా తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు. పరీక్షల సందర్బంగా కొందమంది విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతారని  అలాంటి వారిని ప్రధానోపాధ్యాయులు , ఉపాద్యాయులు   గుర్తించాలని ఆమె తెలిపారు.  విద్యార్థులకు మనోధైర్యాన్ని కల్పించేందుకు  మానసిక వైద్యులను  సంప్రదించేందుకు వీలుగా 24 గంటలు అందుబాటులో ఉండే   18005999333 టోల్ ఫ్రీ ను ప్రవేశపెట్టడం జరిందని  కలెక్టర్ తెలిపారు.     టోల్ ఫ్రీ నెంబర్ ప్రతి ప్రిన్సిపాల్ , ఉపాధ్యాయుల దగ్గర ఖచ్చితంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.  పరీక్ష కేంద్రాల వద్ద సీ.సీ  కెమెరాలు అమర్చాలని, నిరంతరం విద్యుత్ సౌకర్యం ఉండేలా చూడాలని అన్నారు.  ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఎఎన్ఎం లేదా ఆశా వర్కర్ ను తప్పనిసరిగా నియమించడంతో పాటు అత్యవసర మందులు, ఒ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్ఓ  కు కలెక్టర్ సూచించారు. కోవిడ్ నిబంధనలను అనుగునంగా శానిటైజర్ ను కూడా అందుబాటులో ఉంచాలన్నారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికమవుతున్న నేపథ్యంలో   పరీక్ష  కేంద్రాల వద్ద తప్పనిసరిగా టెంట్ , త్రాగు నీరు సౌకర్యం  ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో జిరాక్స్ కేంద్రాలను మూసివేసేలా చర్యలు తీసుకోవలన్నారు.     విద్యార్థులు  పరీక్షలకు సమయానికి హాజరయ్యేందుకు  వీలుగా బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్.టి.సి అధికారులను ఆదేశిచారు.      పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ బంధోబస్తుతో పాటు 144 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు.   ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  జిల్లా ఎస్పీ కోటి రెడ్డి, అదనపు కలెక్టర్ మోతిలాల్ , డీఐఈఓ శంకర్ ,  డీఈఓ రేణుక దేవి, డీఎంహెచ్ఓ తుకారాం, ఆర్టీసీ డిఎం మహేష్, డిటిఓ దశరథ్ ,  ఎలక్ట్రిసిటీ ఎఇ రవిచంద్ర,  హెడ్ పోస్ట్ మాస్టర్ మహమ్మద్ అయూబ్, ఎసిజిఇ ప్రభు తదితరులు పాల్గొన్నారు.

Share This Post