ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ నిర్వాహకులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సెంటర్ ఇంచార్జ్ లను సూచించారు. శుక్రవారం ఉదయం పరీక్షలు నిర్వహిస్తున్న సెంటర్లు గీతాంజలి జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల కళాశాల నాగర్ కర్నూల్, తెలంగాణ సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల తెలకపల్లి కేంద్రాల్లో పర్యటించి పరిశీలించారు. ప్రశ్న పత్రాలు తేరుస్తున్న గది, అందులో సిసి కెమెరా అమర్చార లేదా, రిజిష్టర్ సక్రమంగా నిర్వహిస్తున్నార లేదా అనే వివరాలు నిషితంగా పరిశీలించారు. పిల్లలకు మంచినీటి సౌకర్యం, వైద్య శాఖ ద్వారా ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కిట్లు, శానిటేషన్ తదితర అంశాలను పరిశీలించారు.
కలెక్టర్ వెంట ఉన్న జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణను పరీక్షల నిర్వహణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ వివరిస్తూ ఈ రోజు లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించడం జరిగిందని నేటి లాంగ్వేజ్ పరీక్షకు మొత్తం 3628 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 3311 మంద హాజరు కాగా 317 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్దేధించిన ఆన్ని కేంద్రాల్లో సజావుగా జరిగినట్లు తెలియజేసారు.

Share This Post