ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు.

బుధవారం నాడు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం జరిగిన కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మే 6 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలో పరీక్షల నిర్వహణ కోసం 34 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రథమ సంవత్సరంలో 7124 మందిలో జనరల్ సంబంధించి 5536 మంది విద్యార్థులు, ఒకేషనల్ పరీక్ష సంబంధించి 1588 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో 7018 మందిలో జనరల్ పరీక్షకు 5526 మంది, ఒకేషనల్ పరీక్షకు 1492 మంది విద్యార్థులు వ్రాయనున్నారని తెలిపారు. 34 కేంద్రాలకు 2 ఫ్లయింగ్ స్వ్కాడ్ టీములు, 3 సిట్టింగ్ స్వ్కాడ్స్ టీములు నియమించడం జరిగిందని తెలిపారు. పోలీసు శాఖ పరిధిలో గుర్తించిన భద్రతా కేంద్రాలలో పరీక్షల సంబంధిత పత్రాలు, సామాగ్రి భద్రపర్చడం జరుగుతుందని, పరీక్షల సమయానికి ఆయా పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలు అందజేయడం జరుగుతుందని, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లను ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరీక్షా సమయంలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని తెలిపారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన ఇన్విజిలేటర్లు, సిబ్బందిని నియమించాలని తెలిపారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునే విధంగా బస్సులు నడిపించాలని తెలిపారు. పరీక్షల నిర్వహణ సమయంలో పరీక్షా కేంద్రాలలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య సిబ్బంది, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు, ప్రాథమిక చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ల పరీక్షా కేంద్రాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని తెలిపారు. పరీక్ష ప్రారంభానికి మూడు రోజుల ముందే జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి పరీక్షా కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని తెలిపారు.

కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారులు భూపాల్ రెడ్డి, సూరజ్ కుమార్, జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి సంజీవ, జిల్లా విద్యాశాఖ అధికారి నరసింహ, ఉప జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిల్పిని, జిల్లా పౌరసంబంధాల అధికారి పి. వెంకటేశ్వరరావు, ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మారెడ్డి, భువనగిరి మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్, కలెక్టరేట్ సూపరింటిండెంట్ శ్రీమతి జ్యోతి, విద్యుత్ సంస్థ ADE సత్య ప్రకాష్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ తేజంరెడ్డి పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు.

Share This Post