ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ఇంటర్మీడియట్  పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

  • మే 6 నుండి 19 వరకు థీయారీ పరీక్షలు
  • ఉదయం 9 గంటలనుండి మధ్యాహ్నం 12 గంటల వరకు
  • జిల్లాలో 51 పరీక్షా కేంద్రాలు-
  • మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు 14804 (13096 జనరల్1708 ఒకేషనల్)
  • రెండవ సంవత్సరం పరీక్ష రాస్తున్న విద్యార్థులు 16123 (14369 జనరల్ 1754 ఒకేషనల్)

జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్

                  00000

     జిల్లాలో మే6వ తేదీ నుండి మే19 వరకు  జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అధికారులను ఆదేశించారు.

     సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, పరీక్షా కేంద్రాలను పరిశీలించాలని, త్రాగునీరు, విద్యుత్తు, పరిసరాల పరిశుభ్రత, వైద్య శిబిరాలు వంటి మౌలిక వసతుల ఏర్పాట్లపై పర్యవేక్షించాలని తెలిపారు. ప్రశ్నాపత్రాలు భారీ బందోబస్తుతో పోలీసు శాఖ భద్రతతో ఆయా పరీక్ష కేంద్రాలకు  తరలించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయంలో చేరుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు సకాలంలో బస్సులను ఏర్పాటు చేయాలని, పరీక్షలకు వెళ్లే బస్సులపై డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్ష సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని విద్యుత్ శాఖను, జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని, రవాణా శాఖ అధికారులు బస్సుల పనితీరును పర్యవేక్షించాలని అన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కోవిడ్ వాక్సినేషన్ మొదటి రెండో విడత డోసు వేసుకొని ఉండేలా చూడాలని,పరీక్షల నిర్వహణ కోసం అవసరమైన సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడం జరిగిందని, పరీక్షల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.

     ఈ సమావేశంలో డి ఐ ఓ రాజ్యలక్ష్మి, డీఈవో జనార్దన్ రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జూవేరియా, జిల్లా అగ్నిమాపక  శాఖాధికారి వెంకన్న, మున్సిపల్ కమిషనర్లు  తదితరులు పాల్గొన్నారు.

Share This Post