ఇంటర్మీడియట్ పరీక్షలు సాఫీగా నిర్వహించండి – జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సత్యనారాయణ

ఇంటర్మీడియట్ పరీక్షలు సాఫీగా నిర్వహించండి  – జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సత్యనారాయణ

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఇంటర్మీడియేట్ పరీక్షలు సజావుగా, సాఫీగా నిర్వహించుటలో లైన్ డిపార్ట్మెంట్ అధికారులు సహకరించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సత్యనారాయణ కోరారు. మే 6 నుండి 21 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లాలో 13,777 విద్యార్థుల హాజరు కానున్నారని ఇందుకోసం 31 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రజావాణి లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లప్లై లైన్ డిపార్ట్మెంట్స్ అయినా విద్య, వైద్య, రెవిన్యూ, పొలిసు, విద్యుత్, ఆర్.టి.సి. పోస్టల్ తదితర శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 6,619, ఒకేషనల్ విద్యార్థులు 640 కాగా, ద్వితీయ సంవత్సరపు జనరల్ విద్యార్థులు 6,032 మంది, ఒకేషనల్ విద్యార్థులు 486 పరీక్షలకు హాజరవుతున్నారని సత్యనారాయణ తెలిపారు. ఇట్టి పరీక్షలు సాఫీగా నిర్వహించుటకు ఒక తహశీల్ధార్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ లెక్చరర్ తో ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను, నలుగురు జూనియర్ లెక్చరర్ లతో సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను, 5 మంది సభ్యులతో కస్టడీయన్ లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 13 పోలీస్ స్టేషన్ లలో భద్రపరుస్తున్న ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించుటకు, సెక్యూరిటీ ఏర్పాటు చేయడంతో పాటు, 31 పరీక్షా కేంద్రాలకు అవసరమైన పొలిసు బందోబస్త్ ఏర్పాటు చేయవలసినదిగా పొలిసు అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు, సమీప జిరాక్స్ కేంద్రాలను మూసివేయించాలని, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయాలని, సున్నిత, అతి సున్నిత కేంద్రాలను గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా రెవిన్యూ అధికారులను కోరారు. పరీక్షలకు సాఫీగా నిర్వహించుటకు అవసరమైన సిబ్బందిని ఇన్విజిలేటర్లుగా కేటాయించవలసినదిగా విద్యాశాఖాధికారి సూచించారు . వేసవి కాలం దృష్ట్యా ప్రతి కేంద్రము వద్ద ప్రాథమిక చికిత్స అందించుటకు అవసరమైన మందులు, ఓ.ఆర్ .ఎస్. ప్యాకెట్లతో ఏ.యెన్.ఏం. లను ఏర్పాటు చేయవలసినదిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని, విద్యుత్ లో అంతరాయం కలగకుండా చూడవలసినదిగా విద్యుత్ అధికారులను కోరారు. గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు 8. 30 గంటల వరకు వచ్చే విధంగా బస్సులు నడపవలసినదిగా ఆర్.టి.సి. అధికారులను కోరారు. పోస్టల్ శాఖ వారు పరీక్షల సమయంలో వచ్చే పార్సిళ్లను మధ్యాన్నం మూడు గంటల వరకు తీసుకొని వెంటనే స్పీడ్ చేయాలని కోరారు. పరీక్షా కేంద్రాలకు కేటాయించిన పొలిసు, వైద్య శాఖ సిబ్బంది మొబైల్ నెంబర్లు అందజేయవలసినదిగా ఆయన కోరారు. లైన్ డిపార్ట్మెంట్లు అధికారులకు అప్పగించిన పనిని బాధ్యతతో చేసి పరీక్షలు విజయవంతంగా నిర్వహించుటలో సహకరించవలసినదిగా సత్యనారాయణ కోరారు. ఉదయం 9 నుండి మధ్యాన్నం 12 గంటల వరకు జరిగే పరీక్షలకు విద్యార్థులు ఉదయం 8.30 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, మొబైల్స్ అనుమతి లేనందున ఎవరు వెంట రెచ్చుకోవద్దని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో డి.ఎస్.పి సైదులు, జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ కుమార్, కలెక్టరేట్ ఏ.ఓ. మన్నన్, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.

Share This Post