ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ పగడ్బందీగా నిర్వహించాలి: విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రచురణార్ధం…2


జయశంకర్ భూపాలపల్లి మార్చి 13

 

ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ పగడ్బందీగా నిర్వహించాలి: విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జిల్లాలో పరీక్షలు నిర్వహించే 8 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు రాసే అభ్యర్థులకు కావలసిన అన్ని మౌలిక వసతులు సమకూర్చామూ పగడ్బందీగా పరీక్షలు నిర్వహిచేందుకు సర్వం సిద్ధం చేసాం:జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 నుండి ఏప్రిల్ 1వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ను పగడ్బందీగా నిర్వహించాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని అన్ని జిల్లాల కలెక్టర్ లను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు సోమవారం రాష్ట్ర ఇంటర్మీడియట్ కమిషనర్ నవీన్ మిట్టల్ ,ప్రిన్సిపాల్ సెక్రటరీ వాకాటి కరుణ, తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులకు కావలసిన మౌళిక సదుపాయాలతో పాటు విద్యుత్ మరియు సి సి కెమెరాల ఏర్పాటు తో పాటు మరుగుదొడ్లు, ఆరోగ్య శాఖ నుండి ఒక ఆశ ఏ ఎన్ ఎం లను ఏర్పాటు చేసి ఎమర్జెన్సీ మెడికల్ కిట్ మరియు ఓ ఆర్ యెస్ ప్యాకెట్ లను అందుబాటులో ఉంచుకునే విదంగా ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ లను కోరారు వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మంత్రి గారితో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 8 సెంటర్లలో పరీక్షలు నిర్వహిచేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పొలీస్ సిబ్బంది,ఆరోగ్య శాఖ, పోస్ట్ సిబ్బంది, రవాణా శాఖ, మరియు రెవెన్యూ సిబ్బంది అవసరమైన అన్ని శాఖల అధికారులు సిబ్బంది ని ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు అలాగే పరీక్షలు రాసే విద్యార్థులకు తగు సలహాలు సూచనలు అందచేసి మానసిక ఒత్తిడి కి గురికాకుండా ప్రశాంత వాతావరణం లో పరీక్షలు రాసేటట్టు ఏర్పాట్లు చేశామని అభ్యర్థు లకు ఏమైనా సందేహాలు ఉంటే సలహాలు సూచనలు ఇవ్వడానికి రాష్ట్రస్థాయిలో టేలిమానస్ టోల్ ఫ్రీ నెంబర్ 14416 ను ఏర్పాటు చేశామని ఈ నంబర్లో మానసిక వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉంటారని కలెక్టర్ అన్నారు పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది అని విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకుని పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి, ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కె దేవరాజం, ఆర్ డి ఓ కె శ్రీనివాస్,మున్సిపల్ కమిషనర్, అవినాష్,టి యెస్ ఆర్టీసీ, విద్యుత్, పోస్టల్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

పౌరసంభందాల జిల్లా అధికారి జయశంకర్ భూపాలపల్లి చే జారి చేయనైనది

Share This Post