పత్రికా ప్రకటన తేది: 06-05-20 22
ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసి, భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య .
శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాలని పరిశీలించారు.
జిల్లాలోని ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని జడ్పీ చైర్మన్ సూచించారు. పరీక్ష జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో జరుగుచున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడమైనదని పోలీస్ అధికారులు తెలిపారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఇంటర్మీడియట్ పరీక్షలు వ్రాస్తున్నా విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పి, మంచిగా పరీక్షలు వ్రాసి మంచి ఫలితాలు తీసుకురావాలని అన్నారు.
తదనంతరం రెవిన్యూ అధికారి రాములు ఇంటర్ మీడియాట్ పరీక్షల కేంద్రాన్ని పరిశీలించారు. విద్యార్థిని, విద్యార్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలపై అరా తీశారు. త్రాగునీరు, గాలి వెలుతురు అన్నింటిని పరిశీలించారు. విద్యార్తుల హాజరు శాతం అడిగి తెలుసుకున్నారు.
జిల్లా లో మొత్తం 14 సెంటర్లకు 4476 మంది విద్యార్థిని, విద్యార్తులు హాజరు కానుండగా, 3,944 మంది హాజరు అయ్యారని, 532 మంది హాజరు కాలేదని నోడల్ అధికారి హృదయ రాజు తెలిపారు.
చైర్మెన్ గారితో పాటు ఇంటర్ మీడియాట్ నోడల్ అధికారి హృదయరాజు , ఉపాధ్యాయులు ,విద్యాశాఖ అధికారులు, పోలీసు శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.
—————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారి చేయబడినది.