ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని అదనపు జిల్లా కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్ తెలిపారు.

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని అదనపు జిల్లా కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్ తెలిపారు.
       సోమవారం అదనపు జిల్లా కలెక్టర్ నల్గొండ లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేసినట్లు, రవాణా, వైద్యం, తదితర సౌకర్యాలను ఆయన సమీక్షించారు.
       జిల్లాలో 58 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు జరుగుతున్నాయని, ఈ నెల 25వ. తేది నుండి నవంబర్ 3 వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు. జిల్లాలో జనరల్,ఒకేషనల్ కలిపి మొత్తం ఇంటర్మీడియట్ విద్యార్థులు (16816) మంది పరీక్షలు వ్రాయవలసి ఉండగా,ఇందులో జనరల్ 13578 మంది,ఒకేషనల్ విద్యార్థులు 1957 మంది మొత్తం 15535 మంది సోమవారం లాంగ్వేజ్ పరీక్షకు హాజరయ్యారని,జనరల్ 1023 మంది,ఒకేషనల్ 258 మంది మొత్తం 1281  మంది  విద్యార్థులు గైర్హాజరయ్యారనీ ఆయన వివరించారు.
        కోవిడ్ ను దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాల వద్ద  ఉదయం, సాయంత్రం శానిటైజ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారని, ఎలాంటి అవకతవకలు జరగకుండా పరీక్ష కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు, పరీక్ష కేంద్రాలకు రెవెన్యూ, పోలీసు, ఆర్టీసీ, మునిసిపాలిటీ తదితర శాఖల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించి,బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.అదనపు కలెక్టర్ వెంట ఇంటర్మీడియట్ విద్య అధికారి దసృనాయక్ తదితరులు ఉన్నారు.

Share This Post