ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని అదనపు కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్ తెలిపారు.

శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రం లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల,గీతాంజలి జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు  కల్పించిన  మౌలిక సదుపాయాలు,  భద్రతా ఏర్పాట్లు,సి. సి. కెమెరాల ఏర్పాటు, వైద్యం, 144 సెక్షన్ అమలు, జీరాక్స్ సెంటర్ ల మూసివేత తదితర విషయాలపై ఆరా తీసి  సంతృప్తి వ్యక్తం చేశారు.  జిల్లాలో  శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం పరీక్షలకు 17206 మంది  విద్యార్థులు హాజరు కావలసి ఉండగా  16194 మంది  విద్యార్థులు  హాజరయ్యారు.  1012 మంది విద్యార్థుల గైర్హాజర్ అయ్యారు.  ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ మాట్లాడుతూ  పరీక్షల నిర్వహణ లో ఎలాంటి   అవాంఛనీయ సంఘటనలు  జరగకుండా  అప్రమతంగా ఉండాలని,  విద్యార్థులు  మొబైల్ ఫోన్లు పరీక్ష కేంద్రాలకు  తీసుకురాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలని  కేంద్ర  నిర్వాహకులను ఆదేశించామని తెలిపారు.   జిల్లా కలెక్టర్ వెంట ఇంటర్మీడియట్ అధికారి దస్రు నాయక్ తదితరులు ఉన్నారు

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని అదనపు కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్ తెలిపారు.

Share This Post